NTV Telugu Site icon

CM Revanth Reddy: సంప్రదాయాలతో నిండిన తెలంగాణకు మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం

Cm Revanht Reddy

Cm Revanht Reddy

CM Revanth Reddy: వేల సంవత్సరాల నాటి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలతో నిండిన తెలంగాణకు మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ వద్ద కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఆధ్వర్యంలో జరుగుతున్న  పునరుద్ధరణ ప్రాజెక్ట్ ముగింపు కార్యక్రమంలో మీ అందరితో కలిసి పాల్గొనడం నాకు ఆనందంతో పాటు గౌరవంగా ఉందన్నారు. శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు మరియు ఇతరులు ఈ ప్రాంతాన్ని పాలించారని తెలిపారు. ప్రతి ఒక్కరు వారి ప్రత్యేకమైన సాంస్కృతిక ముద్రను వేశారని తెలిపారు. చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌షాహి సమాధులు, పైగా సమాధులు, వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, అలంపూర్ దేవాలయాలు వంటివి వాస్తు అద్భుతాలకు తెలంగాణ నిలయంగా ఉందన్నారు.

Read also: Bandi Sanjay: భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం..

శతాబ్దాలుగా హైదరాబాద్ ‘గంగా-జమునా తెహజీబ్’గా పిలువబడుతు బహుళ జాతులు, సంస్కృతుల సామరస్యాన్ని, సహజీవనాన్ని చూసిందన్నారు. కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ , సెవెన్ టూంబ్స్ ఔట్స్ షాహిన్ రాజవంశం  నిర్మాణ నైపుణ్యానికి , సాంస్కృతిక గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తాయన్నారు. మన ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడటంతో పాటు ప్రపంచ పటంలో సగర్వంగా ఉంచుతుందన్నారు. యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశం రామప్ప దేవాలయానికి తెలంగాణ గర్వకారణమని తెలిపారు. 2013లో MOUతో ప్రారంభించి,100 కంటే ఎక్కువ స్మారక చిహ్నాల పరిరక్షణ తో పాటు 106 ఎకరాల విస్తీర్ణంలో  చేపట్టిన ఈ కార్యక్రమం అతిపెద్ద పరిరక్షణ ప్రయత్నానికి నిదర్శనమని తెలిపారు. ఆఘాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ సహకారానికి , ఉదారతకు తెలంగాణ  ప్రభుత్వం , హైదరాబాద్ ప్రజల తరపున అభినందనలు , కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
Shamirpet Road Accident: శామీర్ పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్..

Show comments