Site icon NTV Telugu

CM Revanth ReddY: పేదలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం..

Cm Revanth

Cm Revanth

విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తొలి దశలో ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ పై దృష్టి సారించాలని సూచించారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలన్నారు.

Also Read:SVSN Varma: మరోసారి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు.. నేను పిల్లర్ లాంటి వాడిని..

ప్లే గ్రౌండ్, అవసరమైన తరగతి గదులతోపాటు మంచి వాతావరణం ఉండేలా చూడాలని తెలిపారు. ఇందుకు విద్యా శాఖ పరిధిలో ఉన్న స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. సరైన సౌకర్యాలు లేని పాఠశాలలను దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలానికి తరలించాలన్నారు. నర్సరీ నుంచి 4 వ తరగతి వరకు నూతన స్కూల్స్ ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలన్నారు. అక్కడ కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అన్ని వసతులతో విద్యను అందించే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు పాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు. 2026 జూన్ లో అకడమిక్ ఇయర్ నుంచి అమలు జరిగేలా యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్లాలాని సీఎం రేవంత్ సూచించారు.

Exit mobile version