CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం పేదల కుటుంబాలపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించే లక్ష్యంగా గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ చొరవ కింద, నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే కుటుంబాలకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. దీంతో ఈ కుటుంబాలకు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో ఆర్థిక భారం గణనీయంగా తగ్గింది. తాజాగా ఈ పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. బడుగు బలహీన వర్గాల ఇళ్లలో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం చేస్తున్న సంకల్పం సత్ఫలితాలను ఇస్తోందని పేర్కొన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా ఒక్క హైదరాబాద్‌లోనే 10.52 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, ఇది అద్భుతమైన పరిణామమని సీఎం పేర్కొన్నారు. సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఇందిరమ్మ పరిపాలన వారసత్వాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు.
Suman Kumar: హ్యాట్రిక్తోపాటు పది వికెట్లు తీసి సంచలనం సృష్టించిన సుమన్ కుమార్
ఈ ఏడాది మార్చిలో లబ్ధిదారుల సంఖ్య 8,71,841 ఉండగా, నవంబర్ నాటికి 10,52,432కు చేరుకుంది. అయితే.. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ప్రభుత్వం గత మార్చి నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. గృహజ్యోతి పథకానికి గ్రేటర్ హైదారాబాద్‌లో 21 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటి వరకు పదిన్నర లక్షల మందికిపైగా అర్హత సాధించారు. అయితే.. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటుచేకోవడంతో.. ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు ఆఫ్ ఫలితంగా నిన్నా మొన్నటి వరకు నెలకు సగటున 200 యూనిట్లకుపైగా విద్యుత్ వినియోగించిన వారు.. ప్రస్తుతం 150 యూనిట్ల లోపే వాడుతున్నారు. ఫలితంగా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఈ లబ్ధిదారుల సంఖ్య మరింత పెరగనున్నట్లు డిస్కంలు అంచనా వేస్తున్నాయి.
Pushpa 2: ఇదేం వాడకం అయ్యా.. మెట్రో రైలెక్కిన పుష్ప రాజ్