Site icon NTV Telugu

CM Revanth Reddy: తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

Cm Revanth Reddy

Cm Revanth Reddy

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పదకొండేళ్ళు పూర్తయి పన్నెండో సంవత్సరంలో అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.

READ MORE: MP Lavu Sri Krishna Devarayalu: FCI చైర్మన్‌గా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు.. కేంద్రం ఉత్తర్వులు

ఏళ్లకేళ్లుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ఆర్ధిక వృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి ప్రతిన బూనారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో.. భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు.

READ MORE: TTD: పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు.. టీటీడీ వార్నింగ్..

Exit mobile version