Site icon NTV Telugu

CM Revanth Reddy : ఇందిరమ్మ రాజ్యం .. మీ చెమట కష్టమే

Cm Revanth Reddy

Cm Revanth Reddy

కాంగ్రెస్ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ జన జాతర బహిరంగసభ నిర్వహించారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కేసులు లేని వాళ్ళు.. వేధింపులు గురికాని కాంగ్రెస్ కార్యకర్తలు లేరన్నారు. ఇందిరమ్మ రాజ్యం .. మీ చెమట కష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు. మీ త్యాగం మరవం.. జెండా మోసిన వాళ్ళ రుణం తీర్చుకునే సమయం వచ్చిందన్నారు. కేసీఆర్ హయాంలో నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగిందని, కేసీఆర్ కుటుంబంలో అందరికి ఉద్యోగాలు వచ్చాయి కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదన్నారు. రెండు నెలల్లో ఉద్యోగాలు ఇచ్చినమన్నారు. కేసీఆర్..కేటీఆర్..హరీష్..కడుపు మండుతుందని, పదేళ్లు పేద పిల్లలు ఉద్యోగాలు రాకుండా పోతే ఆలోచన చేశాడా కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. నీ బిడ్డ ఎంపీగా ఓడిపోతే.. ఎమ్మెల్సీ చేసినవని, కానీ పేదల పిల్లల ఉద్యోగాలు ఎందుకు ఆలోచన చేయలేదన్నారు. త్వరలోనే మెగా డీఎస్సీ అని ఆయన ప్రకటించారు. మూడు నెలలు..ఆరు నెలలు ఉండదు ఈ సర్కార్ అంటే..లాగులో తొండలు ఇడవండంటూ ఆయన వ్యాఖ్యానించారు.

కేటీఆర్.. నీకు దమ్ముంటే ఎంపీ ఎన్నికలు వస్తున్నాయని, నేనే సీఎం..నేనే పీసీసీ రా చూసుకుందామన్నారు. ఒక్క సీటు గెలుచుకో అని, నను అల్లాటప్పగా అనుకున్నవా.. చర్లపల్లి జైలులో పెట్టినా.. నిలదొక్కుకుని వచ్చా అని ఆయన అన్నారు. యూ ట్యూబ్ అంటున్నాడు.. ఏ ట్యూబ్ అయినా పెట్టుకో.. ట్యూబ్ పగల కొడతామంటూ రేవంత్‌ అన్నారు. కృష్ణా నగర్ లో ఏదైనా బిజినెస్ పెట్టుకో సోనియా మాట చెప్తే అది శీలశాసనం.. ఆ మాట అమలు చేసి తీరుతామన్నారు. గుజరాత్ మోడల్ అంటే ఏంది .? అని ఆయన ప్రశ్నించారు. రైతులను కాల్చి చంపుడా.. ఎన్నికలు అంటే..ముందు ఈడీ ..సీబీఐ పంపుడా అని ఆయన అన్నారు. వింటే వదిలేయడం.. లేకుంటే కేసులు పెట్టుడా..? అని రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version