NTV Telugu Site icon

CM Revanth Reddy : ఫైనల్స్‌లో బీజేపీని ఓడించి తెలంగాణ పౌరుషాన్ని చూపించాలి

Revanth Reddy

Revanth Reddy

కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ఇక్కడకు వలస వస్తే తెలంగాణ వాదం కోసం గెలిపించారని, పాలమూరుకు వస్తే మేమూ గెలిపించామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్స్ మాత్రమేనని, ఇప్పుడు జరిగేవి ఫైనల్స్… సెమీస్ లో కేసీఆర్ ని చిత్తు చిత్తుగా ఓడించారన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఈ ఎన్నిక్కల్లోనూ బిఅరెస్ బీజేపీ లను ఓడించాలని, విభజన హామీలను అమలు చేయని బీజేపీ.. తెలంగాణ ఏర్పాటుని పార్లమెంట్ సాక్షిగా అవహేళ చేసి అవమానించారన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఏర్పాటును అవమానిస్తుంటే బండి సంజయ్ ఏమి చేశారని, తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే నిజామాబాద్ గుండు, కరీంనగర్ అరగుండు ఏం చేసారన్నారు. తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డు ఇచ్చిందని ఆయన విమర్శించారు.

అంతేకాకుండా..’అయోధ్యలో రాముని కల్యాణం జరగక ముందే అక్షింతలు పంచి రాముణ్ణి అవమానించింది బీజేపీ. మేమంతా హిందువులమే.. శ్రీరాముడు మాకు కూడా దేవుడే… హిందుత్వాన్ని దేవుణ్ణి ఓట్లకోసం మేము వాడము.. గుండు అరగుండు కరీంనగర్ నిజామాబాద్ లలో బస్టాండ్ లో దేవుని బొమ్మ పెట్టుకుని చిల్లర అడుక్కున్నట్టు రాముని బొమ్మతో ఓట్లు అడుక్కుంటున్నారు. బీసీ జనగణకు మేము ప్రయత్నం చేస్తుంటే బీజేపీ ఉన్న రిజర్వేషన్లను రద్దు చేసే కుట్రలు చేస్తుంది. బీజీపీ 400 సీట్ల నినాదం వెనక కుట్ర ఉంది.. మూడింట రెండువంతుల సీట్లు పొంది రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు. ఈ దేశ మూలవాసులైన ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేయలనుకుంటున్నారో చెప్పాలి. నేను వేదికల మీద మాట్లాడిన మాటలకు ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చారు.. పదేళ్లుగా కేసీఆర్ నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఇంటికి పోయాడు.

 

కేసీఆర్ బస్సు యాత్ర తిక్కలోడు తిరునాళ్లకు పోయినట్టు ఉంది. బీజేపీ బిఅరెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని డమ్మీ అభ్యర్థులను పెట్టుకున్నారు. కేసీఆర్ ని ఇండియా కూటమిలోకి రానివ్వం.. కేసీఆర్ ఇంటిమిది కాకి మా ఇంటికి వచ్చిన ఊరుకోము… ఆ కాకిని కాల్చి పడేస్తాం. ఖమ్మంలో మాట్లాడుతూ నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అయితడు అన్నారు.. అంటే బీజేపీ తో ఫిక్సింగ్ ఉన్నట్టే కదా. రామప్ప దేవుని మీద ఒట్టేసి చెబుతున్న ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం. రుణమాఫీ చేయకపోతే ఈ ప్రభుత్వం ఉండి కూడా ఉపయోగం లేదని భావిస్తున్నాను..’ అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

Show comments