CM Revanth Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు (డిసెంబర్ 2) రాత్రి ఢిల్లీకి పయనం కానున్నారు. రేపు (డిసెంబర్ 3, బుధవారం) ఉదయం నుంచి ఆయన దేశ రాజధానిలో పలు ముఖ్యమైన సమావేశాల షెడ్యూల్‌లో పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా.. హైదరాబాద్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్-2026కు ప్రముఖులను ఆహ్వానించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తోపాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా వారికి అధికారికంగా ఆహ్వాన పత్రికలు అందజేయనున్నారు.
5G సపోర్ట్, బెస్ట్ ఫీచర్స్.. 7040mAh బ్యాటరీతో Samsung Galaxy Tab A11+ భారత్‌లో లాంచ్!
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను అంతర్జాతీయంగా గ్లోబల్ ఏఐ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ఈ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే దేశ రాజకీయ నాయకత్వం మొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడానికి సీఎం రేవంత్ స్వయంగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అధికారిక ఆహ్వానంతో పాటు, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా కేంద్ర పథకాల కేటాయింపులు, పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంది.
Subrahmanya Swamy Pooja: మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజ.. ఎలాంటి విశిష్టతలు లభిస్తాయంటే..!
సీఎం షెడ్యూల్ వివరాలు:
డిసెంబర్ 2 రాత్రి 8 గంటలకు: హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనం.
డిసెంబర్ 3 ఉదయం: పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, ఖర్గే, కేంద్ర మంత్రులతో భేటీ.
డిసెంబర్ 3 మధ్యాహ్నం 2 గంటలకు: ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్‌కు పయనం.
డిసెంబర్ 3 సాయంత్రం 4 గంటలకు: హుస్నాబాద్‌లో జరిగే కార్యక్రమానికి హాజరు.
