CM Revanth Reddy : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ని ఫోన్ లో పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం ఆయన చేస్తామని అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం అన్నారు, నిందితుల పై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య , గ్రంధాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తో కలసి రంగరాజన్ ని పరామర్శించేందుకు వచ్చిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడించడం జరిగింది. యాదయ్య మాట్లాడుతూ.. రంగరాజన్ పై దాడి చేయడం అప్రజాస్వామికం ఇటువంటి దాడులు మంచివి కావు, పోలీస్ వారు వారిపై చర్యలు తీసుకునేలా చూస్తాం అన్నారు.
Bird Flu: తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. చికెన్ తినొద్దని అధికారుల హెచ్చరిక
ఇదిలా ఉంటే.. భారీ పరిశ్రమలు, ఐటీ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. రామ రాజ్యం పేరుతో దాడులు చేసే వారిని ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, రామరాజ్యం పేరుతో చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు , నిర్వాహకులు అయిన సౌందర్య రాజన్ గారి పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇది హేయమైన చర్య, రామరాజ్యం పేరుతో రౌడీయిజం చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేది లేదని, రాముడి పేరును బద్నామ్ చేస్తూ అరాచక అనాగరిక కార్యక్రమాలకు పాలపడడం దుర్మార్గం వారు చేసే ఆగడాలకు రాముడి పేరును వాడుకుంటు రామరాజ్యం అని చెప్పడం క్షమించని నేరం అంతే కాదు రాముడి భక్తుల మనోభావాలను దెబ్బ తీసే చర్య అని ఆయన మండిపడ్డారు. కొందరు ప్రజలలో ఉన్న హిందుత్వ భావాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు ఇలాంటి వారి పట్ల పోలీసులు ప్రజలు రాజకీయ పార్టీలు అందరూ అప్రమతంగా ఉండాలన్నారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలు, అరాచక శక్తుల పట్ల ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ధర్మాన్ని కాపాడుతూ సమాజ హితం కోసం నిస్వార్థంగా పని చేస్తున్న అర్చకుల పట్ల ఇలాంటి దాడులు అమానుషమన్నారు. ప్రభుత్వం ఇలాంటి దాడులను ఉపేక్షించదు.. కఠినంగా వ్యవహరిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
Rythu Bharosa : రైతన్నలకు అలర్ట్.. 1834 కోట్ల నిధులు రైతుల ఖాతాలోకి.. ఎన్ని ఎకరాల వరకు అంటే..?