NTV Telugu Site icon

CM Revanth Reddy : హైదరాబాద్‌ గ్లోబల్ లీడర్‌‌గా ఎదుగుతోంది

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : కామన్ వెల్త్ మెడ్-ఆర్బ్ కాన్ఫరెన్స్- 2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి కొత్త కార్యక్రమాలతో టెక్నాలజీలో హైదరాబాద్‌ గ్లోబల్ లీడర్‌‌గా ఎదుగుతోందని, సాఫ్ట్‌వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ మరియు బయో-టెక్నాలజీ పరిశ్రమలకు పవర్ హబ్‌గా హైదరాబాద్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. న్యాయవ్యవస్థ మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, కానీ, భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండడం న్యాయవ్యవస్థకు సవాల్‌గా మారిందన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి, వేగంగా, సమర్థవంతంగా కేసుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థలు అవసరమని, మధ్యవర్తిత్వం, చర్చల ద్వారా వీలైనంత త్వరగా సమస్యలు, వివాదాలను పరిష్కరించుకోవాలన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. అలా చేయడం వల్ల వివాదంలో చిక్కుకున్న ఇరువర్గలకూ ఉపయోగకరంగా ఉంటుందని, అందుకు కృషి చేస్తున్న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్‌‌ నిర్వాహకులను అభినందిస్తున్నానన్నారు.

Tragedy: బావిలో స్నానానికి దిగి ఇద్దరు శివ మాలధారులు మృతి..

మీడియేషన్, ఆర్బిట్రేషన్‌ను సమన్వయం చేస్తే సమస్యలు, వివాదాలను వీలైనంత వేగంగా పరిష్కరించొచ్చని, IAMC అనేది తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు…. దేశం మొత్తానికి ఈ సెంటర్‌‌ ఉపయోగపడుతుందన్నారు. అంతేకాకుండా.. IAMCని గ్లోబల్ ఇన్వెస్టర్స్‌కు, బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే పరిమితం చేయొద్దని, కామన్‌ మ్యాన్‌కు, చిన్న సంస్థలకు కూడా IAMC సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. లండన్, సింగపూర్ తర్వాత ఆర్బిట్రేషన్ మ్యాప్‌లో హైదరాబాద్ నగరం ఉండటం గర్వకారణమని, ఆర్బిట్రేషన్ సేవలను పేదలకు అందుబాటులోకి తీసుకురావడంపై మరో సదస్సు నిర్వహించాలని కోరుతున్నానని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Game Changer: టాలీవుడ్లో హిస్టరీ.. అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్