NTV Telugu Site icon

CM Revanth Reddy : మల్కాజిగిరి ప్రజలను ఓటు అడిగే హక్కు నీకు లేదు..

Revanth Reddy

Revanth Reddy

ఉప్పల్ కార్నర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ను బీజేపీకి తాకట్టు పెట్టిందని, బీఆర్‌ఎస్ ఒక దిష్టిబొమ్మను ముందు పెట్టింది తప్ప .. ఎన్నికల్లో పోటీ చేయడంలేదని, అయ్యా.. ఈటల రాజేందర్..2001 నుంచి 2021 వరకు ఇరవైఏళ్లు కేసీఆర్ తో కలిసి తెలంగాణను విధ్వంసం చేసింది మీరు కాదా అని ఆయన అన్నారు. మీకు పంపకాల్లో పంచాయితీతో విడిపోయారు తప్ప ప్రజల కోసం కాదని, 2021లో వరదలు వచ్చి ఈ ప్రాంతం ముంపుకు గురైతే ఆనాడు ఈటల పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్లు మంత్రిగా ఉండి ఏనాడైనా ఉప్పల్ కు వచ్చావా..? అని ఆయన ప్రశ్నించారు. నువ్ ఏం చేశావని.. ఏం తెచ్చావని మల్కాజిగిరి ప్రజలను ఓటు అడుగుతావ్.. మల్కాజిగిరి ప్రజలను ఓటు అడిగే హక్కు నీకు లేదన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

అంతేకాకుండా..’రాజేందర్, కేసీఆర్ వేర్వేరు కాదు.. నాణానికి బొమ్మా బొరుసు లాంటి వారు.. కేసీఆర్ కాళేశ్వరం పేరుతో దోచుకుంటుంటే ఆర్ధిక మంత్రిగా నిధులు విడుదల చేసింది నువ్వు కాదా రాజేందర్.. కరోనా సమయంలో సంతోష్ రావు కోట్లాది రూపాయలు వెనకేసుకుంటుంటే.. వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నది నువ్వు కాదా రాజేందర్… నువ్వే కదా దొంగలకు సద్దులు మోసింది రాజేందర్.. అప్పుడే మర్చిపోయావా? హైదరాబాద్ చుట్టు భూములను దోచుకుంటుంటే.. చూస్తూ ఊరుకుంది నువ్వు కాదా? గద్దర్ ను అవమానించిన నాడు ఎందుకు ప్రశ్నించలేదు.. కేసీఆర్ అవినీతిపై ఈటెల ఏనాడైనా అమిత్ షా, మోదీకి పిర్యాదు చేశారా? ఈటెల, కేసీఆర్ ది పగలు కుస్తీ.. చీకట్లో దోస్తీ.. ఈటెలకు పదవి, పరపతి తప్ప..తెలంగాణ ప్రజల సంక్షేమం పట్టదు.. రిజర్వేషన్లు రద్దు చేసే బీజేపీ వైపు ఉంటారో… ఎస్సీ,ఎస్టీ,బీసీల వైపు ఉంటారో రాజేందర్ తేల్చుకోవాలి.. అంగీ మార్చినా, రంగు మార్చినా.. ఎన్ని వేషాలు వేసినా రాజేందర్ ను ప్రజలు నమ్మరు.. మోడీ తెలంగాణకు ఇచ్చిందేం లేదు.. గాడిద గుడ్డు తప్ప.. మల్కాజిగిరి పార్లమెంట్ లో సునీతక్కను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించండి..’ అని సీఎం రేవంత్‌ రెడ్డి.