Site icon NTV Telugu

CM Revanth Reddy: ఎల్బీ నగర్ సెమీ క్రిస్మస్ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy1

Revanth Reddy1

మైనార్టీలకు రక్షణ కల్పించింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన సేమి క్రిస్మస్ వేడుకలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మత సామరస్యాన్ని కాపాడేందుకు శయా శక్తుల ప్రయత్నం చేస్తాం. దేశంలో మైనార్టీలకు రక్షణ కాంగ్రెస్ పార్టీ కల్పించింది. డిసెంబర్ నెల మిరాకిల్ మంత్.. నేను చెప్పింది వాస్తవం. ప్రపంచానికి డిసెంబర్ నెల మిరకిల్ మంత్. పాపులను కాపాడాడు యేసు క్రీస్తు. మైనార్టీ సోదరులు సెక్యులర్ గవర్నమెంట్ రావాలని కోరుకున్నారు. ఎర్రకోటపై జెండా ఎగిరినప్పుడే సర్వమత సమ్మేళనం శాంతియుతంగా ఉంటుంది. మణిపూర్ లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజల మాన ప్రాణాలు కాపాడలేదు.

ఎన్నికల ప్రచారంలో మునిగి తేలారు తప్ప.. ప్రజలను పరామర్శించలేదు. మణిపూర్ లాంటి ఘటనలు మరెక్కడా జరుగకుండా చూసుకునే భాద్యత యువతదే. నిస్సహాయులకు చేయూత ఇవ్వడం మా ప్రభుత్వం లక్ష్యం. అర్హులకు అందలం ఎక్కిస్తాం. ఏకే ఆంటోనీ, ఆస్కార్ ఫెర్నాండెజ్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు పని చేసారు. మత సామరస్యాన్ని కాపాడుతాం. చర్చిల్లో ప్రార్థనలు చేసే పెద్దలకు గౌరవ వేతనం ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాము. మేము పాలకులు కాదు సేవకులం… యేసుక్రీస్తునే మాకు ఆదర్శం. భవిష్యత్ లో ఏ భాద్యత ఇచ్చినా భాద్యతగా ఉంటా. సెక్రటేరియట్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ప్రజా వాణిని స్వేచ్ఛగా వినిపించేందుకు అవకాశం కల్పించాం’ అని అన్నారు.

Exit mobile version