Site icon NTV Telugu

CM Revanth Reddy : రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

Revanthreddy Cm

Revanthreddy Cm

రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపే కొత్త
కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యుని కొత్త ప్రయాణం కొత్త మార్పుకు నాంది పలకాలని,
రాష్ట్రమంతటా సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలని అన్నారు. భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే
సంక్రాంతి.. కనుమ పండుగలు.. అందరూ ఆనందంగా జరుపుకోవాలని మనసారా ఆకాంక్షించారు. తెలంగాణలో మొదలైన ప్రజా పాలనలో
స్వేచ్ఛా సౌభాగ్యాలతో ప్రజలు సంతోషంగా పండుగ సంబురాలు జరుపుకోవాలని అన్నారు. సకల జన హితానికి, ప్రగతి పథానికి తమ
ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.

తెలంగాణ ప్రజలకు హృదయ పూర్వక భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలుగు ప్రజలు అత్యంత సంప్రదాయ బద్దంగా ఆనందోత్సహాలతో భోగి, సంక్రాంతి పండుగలను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. భోగ బాగ్యాల భోగి పండుగ.. సంబరాలు పంచె సంక్రాంతి పండుగ.. రైతులకు ఇష్టమైన కనుమ పండుగలను ప్రజలు సంస్కృతి, సంప్రదాయాల నడుమ వైభవంగా జరుపుకోవాలని, ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

Exit mobile version