మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ అప్ గ్రేడేషన్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరుద్యోగ సమస్య అత్యంత కీలక పాత్ర పోషించిందన్నారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగఅవకాశాలు కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు. ష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐ లు నిరుపయోగం మారాయని, ఐటీఐ ల్లో నేర్పించే నైపుణ్యాలు విద్యార్థులకు ఉపయోగం లేకుండా పోయాయని, 40, 50 ఏళ్ల కిందటి నైపుణ్యాలను ఐటీఐ ల్లో నేర్పిస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులు, నిరుద్యోగులను నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని, నా ఆలోచనల నుంచి వచ్చిందే ఏటీసీ సెంటర్స్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
అంతేకాకుండా.. ‘మేం పాలకులు, మీరు బానిసలు అన్న ఆలోచన మాకు లేదు.. మేం సేవకులం… 40 లక్షల మంది యువతీ యువకులు ఉపాధి లేక రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూ తిరుగుతున్నారు… సర్టిఫికెట్ ఉంటే సరిపోదు సాంకేతిక నైపుణ్యం ఉండాలి… సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉపాధి లభిస్తుందని నేను నమ్ముతున్న… కేవలం సర్టిఫికెట్స్ జీవన ప్రమాణాలను పెంచవు.. దుబాయ్ లాంటి దేశాలకు వలసలు వెళ్లకుండా ప్రభుత్వం ఉపాధి గ్యారెంటీ ఇస్తుంది… టాటా సంస్థ సహకారం తో సాంకేతిక నైపుణ్యాల కోసం 2324 కోట్లతో 65 ఐటీఐల ఐటీసీ లు గా మారుస్తున్నాం.. విద్యార్థుల శిక్షణ కోసం ముందుకు వచ్చిన టాటా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.. ఐటీ రంగంలో ప్రపంచం తో మన తెలుగు వారు పోటీ పడుతున్నారు.. మధ్య తరగతి, దిగువ తరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించడమే మా బాధ్యత.. రాష్ట్రం లోని 65 ఐటీఐ లను అత్యంత అధునాతనంగా తీర్చిదిద్దుతాం…
నైపుణ్యాలను నేర్పించడం ద్వారా నిరుద్యోగులకు భరోసా కల్పిస్తాం… విద్యార్థిని విద్యార్థులు ఐటీఐ ల్లో చేరాలి… ఈ శాఖ నా దగ్గరే ఉంటుంది.. నేనే పర్యవేక్షిస్తా.. ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తా..’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
