NTV Telugu Site icon

CM Revanth: పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

Revanth

Revanth

గాంధీభవన్ లో జరిగిన పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మనకోసం పని చేసిన అందరికి అందాల్సిందేనని తెలిపారు. మన ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అనేది కాదు.. మనం బీ ఫార్మ్ ఇచ్చిన నాయకుడి ద్వారానే పథకాలు అందాలని అన్నారు. మన కార్యకర్తలు సంతృప్తి పడేలా పని చేద్దామని రేవంత్ రెడ్డి నేతలకు చెప్పారు. గ్రామ సభలలోనే లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. జిల్లా ఇంఛార్జిలకి పెత్తనం ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల బాధ్యత అంతా ఇంచార్జి మంత్రులదేనన్నారు. సంక్రాంతి తరవత ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని సీఎం పేర్కొన్నారు. పార్లమెంట్ కి నెల ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇదిలా ఉంటే.. నెల రోజుల్లో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు. ఎమ్మెల్సీ సీట్లు అధిష్టానం చూసుకుంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. మరోవైపు.. నామినేటెడ్ పదవులు ఎంపిక ఇంఛార్జి థాక్రే, ఏఐసీసీ కార్యదర్శుల చూసుకుంటారని సీఎం చెప్పారు.

Read Also: Congress: పీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు

ఇదిలా ఉంటే.. పీఏసీ సమావేశంలో ఐదు అంశాలే ఎజెండాగా చర్చ కొనసాగింది. పార్లమెంట్‌ ఎన్నికల వ్యూహంపై చర్చించారు. అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు పీఏసీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్బంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని తీర్మానించారు. రాష్ట్ర ఆర్థిక స్థితి గతులపై భట్టి విక్రమార్క వివరించగా.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చ పెట్టనున్నట్లు పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ తెలిపారు. మిషన్ భగీరథ అవకతవకలపై చర్చ.. రేషన్ కార్డు, ఆసరా పెన్షన్, మహిళలకు రూ.2500, ఇందిరమ్మ గృహాలు, గ్యాస్ ధర రూ.500పై చర్చించినట్లు చెప్పారు.

Read Also: Congress PAC: పీఏసీ కన్వీనర్ సమావేశం.. తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని తీర్మానం

Show comments