NTV Telugu Site icon

Cm Revanth : జూనియర్ లెక్చరర్లు విద్యాలయాలను గొప్పగా తీర్చిదిద్దాలిః సీఎం రేవంత్

Cm Revanth

Cm Revanth

Cm Revanth : తెలంగాణలోని ఇంటర్ కాలేజీలను గొప్పగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత జూనియర్ లెక్చరర్ల మీద ఉందంటూ సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. కొత్తగా ఉద్యోగాలు పొందిన 1292 మంది జూనియర్ లెక్చరర్లకు, 240 మంది పాలిటెక్నికల్ లెక్చరర్లకు రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు వేగంగా చేపట్టిందన్నారు. గత ప్రభుత్వం సాగదీసి నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైందని.. కానీ తాము మాత్రం 55 రోజుల్లోనే నియామకాలు పూర్తి చేశామని రేవంత్ చెప్పుకొచ్చారు.

Read Also : Yogi Adityanath: నేపాల్‌లో ట్రెండ్ అవుతున్న సీఎం యోగి ఆతిథ్యనాథ్.. మరో వివాదం..

తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలతో గవర్నమెంట్ విద్యాలయాలు పోటీ పడలేకపోవడం బాధాకరం అన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో చదువు చెప్పే వారికన్నా గవర్నమెంట్ లెక్చరర్లకే ఎక్కువ నాలెడ్జ్ ఉందని.. అయినా రిజల్ట్ వారికంటే తక్కువ రావడంపై శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రైవేట్ సంస్థలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను తీర్చి దిద్దాలని చెప్పుకొచ్చారు. ఒక ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం వస్తే.. ఆ కుటుంబ భవిష్యత్ మారిపోతుందని.. వారి కష్టాలన్నీ తొలగిపోతాయని వివరించారు. భవిష్యత్ లో మరిన్ని నోటిఫికేషన్లు ఇచ్చి తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడటంలో నిరుద్యోగుల పాత్ర కీలకం అని గుర్తు చేశారు.

Read Also : Sreeleela: బాలీవుడ్ హీరోతో శ్రీ లీల డేటింగ్ వెనుక అసలు కథ ఇదా?