Site icon NTV Telugu

CM Revanth Reddy: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర.. తొమ్మిది మందికి కోటి రూపాయల నగదు పురస్కారం

Cm Revanth

Cm Revanth

తెలంగాణ ఉద్యమంలో ప్రజల గుండెల్లో నిలిచిన కవులు కళాకారులు సాహితీవేత్తలు తొమ్మిది మందికి కోటి రూపాయల నగదు పురస్కారం అందిస్తామని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా గద్దర్ సతీమణి విమలకు కోటి రూపాయల నగదు పారితోషికం అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మందికి కోటి రూపాయల నగదు పురస్కారం అందించారు.

Also Read:Shreyas Iyer: ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ చరిత్ర.. ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలే!

రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా పెరేడ్ గ్రౌండ్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి నగదు పురస్కారం అందించారు. ఎక్కా యాదగిరి రావు, అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి కి పురస్కారాన్ని అందించారు. దివంగత గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి నగదు పురస్కారాన్ని వారి కుటుంబ సభ్యులు అందుకున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న గోరటి వెంకన్న తరపున ఆయన కూతురు పురస్కారాన్ని అందుకున్నారు.

Exit mobile version