NTV Telugu Site icon

CM Revanth Reddy : తండాలు, గూడాల్లో అభివృద్ధి జరిగితేనే అసలైన అభివృద్ధి

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే.. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో చాలా తండాలకు రోడ్డుమార్గం లేదని, తండాలకు 100 శాతం బీటీ రోడ్లు వేయాలని నిర్ణయించామన్నారు. గత ప్రభుత్వంలో చాలా గ్రామాలకు నీరు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. తండాలు, గూడాల్లో అభివృద్ధి జరిగితేనే అసలైన అభివృద్ధి జరిగినట్లు అని ఆయన వ్యాఖ్యానించారు. చేసిన తప్పులకు శిక్షపడ్డా ఇంకా మారడం లేదని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి హరీష్‌రావు ఇంకా వాళ్ళ నాయకుడు చెప్పిన అబద్ధాల్లో బతుకుతున్నారని, 7 లక్షల అవాసాలకు నీళ్లు ఇంకా ఇవ్వలేదని ఆయన అన్నారు. దేవుడి మీకు మంచి బుద్ధి ప్రసాదించండి అని మాత్రమే అడగగలం.. అంతకు మించి ఏం చేయలేం అంటూ విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్‌. సరైన రోడ్లు లేక ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన తెలిపారు.

Getup srinu : రాజుయాదవ్ ఓటీటీ స్ట్రీమింగ్..ఎప్పుడు ఎక్కడ..?

అయితే.. ఆర్టీసీపై అసెంబ్లీలో చర్చ జరగగా.. దీనిపై రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. 2014 నుండి మంత్రి గా పని చేస్తున్నాడు హరీష్ అని, స్పీకర్ మీద ఆరోపణలు చేయడం తగదన్నారు. కార్మికులు కష్టాల్లో ఉన్నప్పుడు.. సమ్మె చేస్తున్నప్పుడు వివక్ష చూశామని ఆయన తెలిపారు. కార్మికుల పక్షాన కొట్లాడే కమ్యూనిస్టు లకు మైక్ ఇస్తే తప్పేంటి అని ఆయన ప్రశ్నించారు. సభలో ప్రశ్న వచ్చింది అంటే… అడిగిన వారికే టైం ఇవ్వాలని ఎక్కడ లేదు అని, సీపీఐ వాళ్లకు మైక్ ఇచ్చారని, సాంబశివరావు కి మైక్ ఇవ్వడం తప్పు పట్టడం తప్పు అని ఆయన అన్నారు. రూల్ బుక్ లో.. సభలో ప్రొటెస్ట్ చేస్తే బయటకు పంప వచ్చని, కానీ మీరు ఆ నిబంధన పట్టించుకోలేదన్నారు. ఆర్టీసీ బలోపేతం కోసం మేము కృషి చేస్తున్నామని, కార్మికులు కష్టాల్లో ఉన్నప్పుడు, సమ్మె చేస్తున్నప్పుడు వివక్ష చూశామన్నారు సీఎం రేవంత్‌. కార్మికుల పక్షాన కొట్లాడే కమ్యూనిస్టులను మైక్‌ ఇస్తే తప్పేంటి.? సాంబశివరావుకి మైక్‌ ఇవ్వడం తప్పా? గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కార్మిక సంఘాన్ని రద్దు చేసింది. ఆనాడు ఆర్టీసీ గౌరవ అధ్యక్షుడు హరీష్‌రావే అని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Parliament Session Live Updates : పార్లమెంట్‌లో బడ్జెట్‌పై చర్చ లైవ్ అప్ డేట్స్