Site icon NTV Telugu

Nara Bhuvaneswari: నేను సీఎం భార్యగా రాలేదు.. మీలో ఒక మహిళగా..

Nara Bhuvaneswari

Nara Bhuvaneswari

Nara Bhuvaneswari: నేను ముఖ్యమంత్రి భార్యగా ఇక్కడికి రాలేదు.. మీలో ఒక మహిళగా ఇక్కడికి వచ్చాను అని వ్యాఖ్యానించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి.. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా 3వ రోజు రామకుప్పం గ్రామంలో పర్యటించిన భువనేశ్వరి.. గ్రామ మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రం చీకట్లో మగ్గిపోయిందని, 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ప్రజాప్రభుత్వంతో రాష్ట్రంలో వెలుగు వచ్చిందని అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం బొడుగుమాకులపల్లి గ్రామంలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖిలో పాల్గొన్నారు.. నేను నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహించినప్పుడు మీరు నాపై చూపిన ప్రేమ, గౌరవం నన్ను ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చిందన్న ఆమె.. చంద్రబాబుపై మీరు గత 40 సంవత్సరాలుగా పెట్టుకున్న నమ్మకానికి మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. ప్రజాప్రభుత్వంలో మహిళలు ధైర్యంగా ఉండొచ్చు.. గత పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.. రాష్ట్ర మహిళలకు ప్రజాప్రభుత్వంతో స్వాతంత్ర్యం వచ్చిందన్నారు.. ఇక, ప్రతి మహిళకు నా కృతజ్ఞతలు అంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి..

https://x.com/JaiTDP/status/1816461791049990362

Exit mobile version