ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఇవాళ (సోమవారం) ఈడీ అధికారులు ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చనున్నారు. అయితే, కేజ్రీవాల్‌ను మరో సారి కస్టడీకి ఇవ్వాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోరనున్నట్లు సమచారం. దీంతో కోర్టు మరో సారి కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి అప్పగిస్తుందా.. లేదా జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తుందా అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మార్చి 22వ తేదీన ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
Read Also: MS Dhoni-Six: విశాఖలో చెలరేగిన ఎంఎస్ ధోనీ.. పండగ చేసుకున్న ఫ్యాన్స్! వైరల్ వీడియో
అయితే, రౌస్ అవెన్యూ కోర్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇక, వారం రోజుల కస్టడీ నేటితో ముగియనుండటంతో అధికారులు ఇవాళ కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరు పర్చేందుకు రెడీ అయ్యారు. దీంతో కోర్టు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే, తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ పిటిషన్ పై రేపు ( మంగళవారం ) విచారణ చేయనుంది.