తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించి తెలంగాణ ప్రజలకు అంకితం చేశారు. ఇక, కొల్లాపూర్ సింగోటం చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును గత పాలకులు, నాయకులు చాలా మంది అడ్డుకున్నారు అని అన్నారు. పాలమూరు జిల్లాలో పుట్టిన నేతలే ప్రాజెక్టును అడ్డుకున్నారు.. ఆనాడు చేయని దద్దమ్మ నాయకులే ఇన్నాళ్లు అడ్డుకున్నారు.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటి నేతలు పాలమూరుపై విమర్శలు చేశారు.. మూడు ప్రాజెక్టులు పూర్తైతే దేశానికే తెలంగాణ అన్నం పెడుతుంది.. తెలంగాణలో మనకు రావాల్సిన నీటి వాటాలను లెక్కగట్టి మూడు ప్రాజెక్టుల పనులను ప్రారంభించామని సీఎం కేసీఆర్ తెలిపారు.
Read Also: Lovers kissing video : బైక్ పై ముద్దులతో రెచ్చిపోయిన లవర్స్.. వీడియో వైరల్..
పాలమూరుకి నీళ్లు అడిగితే కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా ఏం చేసిందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీకి పౌరుషం ఉంటే కృష్ణ ట్రిబ్యూనల్ లో వాటాలు తేల్చండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా బీజేపీ జెండా పట్టుకుని వస్తే ప్రజలు నిలదీయాలి అని కేసీఆర్ చెప్పారు. ముఖ్యమంత్రులు దత్తత తీసుకున్నా పాలమూరుకు న్యాయం జరుగలేదు.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వల్లనే న్యాయం జరుగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు పొంగు చూసి నా ఒళ్లు పులకరిస్తుంది అని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ తో నా జన్మ ధన్యమైంది.. కేంద్రానికి, ఆంధ్ర పాలకులకు చెబుతున్నా.. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను కేటాయించండి అని కేసీఆర్ వార్నింగ్ హెచ్చరించారు.
Read Also: Cheetahs Died: కునో నేషనల్ పార్క్‌లో చిరుతలు ఎందుకు చనిపోయాయో తెలుసా..!
50 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 16 ఏళ్ల టీడీపీ పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా వచ్చిందా..? సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. డాక్టర్లను ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ మారింది.. విద్యా, వైద్యం, విద్యుత్ రంగంలో ఒక్కో మెట్టు ఎదుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. చెక్ డ్యామ్లు, 3 ఇరిగేషన్లకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొల్లాపూర్ అభివృద్దికి సీఎం స్పెషల్ ఫండ్ నుంచి రూ. 25 కోట్లు కేటాయింపు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. మహబూబ్ నగర్ పట్టణానికి ఇంజినీరింగ్ కాలేజ్ ఇస్తామని తెలిపారు.. అలాగే కొల్లాపూర్ లో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కూడా నిర్మిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.