NTV Telugu Site icon

CM KCR: వందకోట్ల వెనుక ఎవరున్నారు? తేల్చాల్సిందే !

Kcrrr (1)

Kcrrr (1)

మునుగోడు ఉప ఎన్నిక వేళ ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ హాట్ టాపిక్ అయింది. చండూరు బహిరంగ సభలో దీనిపై తీవ్రంగా మాట్లాడారు సీఎం కేసీఆర్. తల మాసిన ఒకడు తడి బట్టలతో ప్రమాణం అంటున్నాడు. వందల కోట్లతో దొరికారు. ఆ దొంగలు జైల్లో ఉన్నారు. విషయం న్యాయ స్థానంలో ఉన్నారు. ఢిల్లీ పీఠం కూడా అదిరిపోయే పరిస్థితి ఉంది. ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు చేస్తున్నారు. ఇలాంటి వారిని బంగాళా ఖాతంలో విసిరేయాలి. ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చే వారిన తరిమేయాలన్నారు సీఎం కేసీఆర్.

ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామనుకున్నారు. రూ.100 కోట్లు ఇస్తామన్నా ఆత్మగౌరవాన్ని కాపాడారు. ఎడమకాలి చెప్పుతో కొట్టినట్లు వారికి బుద్ది చెప్పారు. ఇంత అరాచకం జరుగుతుంటే మౌనం పాటిద్దామా?రాజకీయం అంటే అమ్ముడుపోవడం కాదని మా ఎమ్మెల్యేలు నిరూపించారు. ఆర్‌ఎస్‌ఎస్ ముసుగులో వచ్చి చంచల్‌గూడ జైల్ లో ఉన్నారు. వందల కోట్లు ఎక్కడినుంచి వచ్చాయో విచారణలో తేలాలి. దీని వెనక ఉన్నవాళ్లు ఒక్క క్షణం కూడా పదవుల్లో ఉండేందుకు వీళ్లేదు. మోడీ రెండు సార్లు పీఎం అయ్యావు.. నీకేం కావాలి.

Read Also: Ponnala Lakshmaiah: ఫాంహౌస్ నుంచి రాజకీయం చేసేవాళ్లు.. దేశాన్ని ఎలా బాగుచేస్తారు?

మనం చైతన్యం కావాలి. దోపిడీ దారులు మాయమాటలు చెబుతారు. వారి మాటలు నమ్మవద్దు. నిన్న మొన్న ఢిల్లీ బ్రోకర్ గాళ్ళు వంద కోట్లు ఇస్తామంటే ఎడమకాలి చెప్పుతో కొట్టారు. తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగరేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్థన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు… ఇలాంటి వాళ్ళు కావాలి. 100 కోట్లు ఇస్తామంటే వద్దన్నారు. గడ్డిపోచలా వాటిని పడేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడారు. అక్రమ ధనం తెచ్చి.. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యుల్ని సంతలో పశువుల్లా కొని ప్రభుత్వాలను కూల్చాలని చూస్తున్నారు. ఒళ్లు మరిచిపోయి ఓటు వేస్తే… ఇళ్ళు కాలిపోతాది. దేశంలో ఏమి జరుగుతున్నది ? కరిచే పాము అని తెలిసి మెడలో వేసుకుంటామా ?

కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే చేనేత కార్మికుల కుటుంబాల నుంచి ఒక ఓటు కూడా బీజేపీకి ఓటు వేయొద్దు.. పాము కరుస్తుందని తెలిసి.. ఆ పాముకి ఓటు వేద్దామా? చేనేతలు బీజేపీకి బుద్ధి చెప్పాలి.బిజెపికి తెలంగాణలో బుద్ధి చెప్పాలి . ఇండియా ఆకలి రాజ్యంగా మారుతుందా? డాలరుతో రూపాయి విలువ 82 రూపాయలా. అర్థం అయిన తర్వాత కూడా బుద్ధి చెప్పాలి. మీ ఓటే మీ ఆయుధం. నాటకాలు నడవవు. లక్షల కోట్లు పేదలకు చెందినది పెద్దలకు ఇస్తారా? ప్రభుత్వరంగంలోని కంపెనీలను కాపాడదామా? వడ్డు కొనుడు చేతకాదు.. 100 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొంటారా? బీజేపీకి బుద్ధి చెప్పాలి… ఓటు ద్వారా మనం తిరుగుబాటు చేయాలి. మీ ఆటలు సాగవని మనం సందేశం ఇవ్వాలి. వామపక్షాలు, మేము చేయగలిగింది ఏమీ లేదు. ఇంటింటికి వచ్చి చెబుతున్నాం. అన్యాయం జరిగింది.. పెట్రోల్ ధర పెరిగింది.. జీఎస్టీమీద పోరాడాలి. కత్తి ఒకని చేతిలో పెట్టి వేరే వాడిని యుద్ధం చేయమంటే ఎలా? అన్నారు కేసీఆర్.

Read Also: Mamata Banerjee: దేశంలో అధ్యక్ష తరహా పాలన.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి..