CM KCR: ఎన్నికలు వస్తే ఆగమాగం కావద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు సూచించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. మంచి వాళ్ళ చేతిలో రాష్ట్రం ఉంటే మంచిగా ఉంటుందని.. బేకార్ గాళ్ల చేతుల్లో పడితే ఆగం అవుతుందన్నారు. బీఆర్‌ఎస్ చరిత్ర మీ అందరికి తెలుసని.. మీ ముందే బీఆర్‌ఎస్ పుట్టింది.. తెలంగాణ కోసమే బీఆర్‌ఎస్ పుట్టిందన్నారు. పటాన్ చెరులో కాలుష్యం ఎక్కువ అని.. అందుకే ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచి నీళ్ళు ఇస్తున్నామన్నారు. పటాన్ చెరులో కాలుష్యం తగ్గాలి.. కాలుష్య రహిత పరిశ్రమలు తేవడానికి కృషి చేస్తున్నామన్నారు. పటాన్ చెరు హైదరాబాద్‌లో కలిసిపోయిందన్నారు. ఐటీ పరిశ్రమలు కూడా త్వరలో వస్తాయన్నారు.
Also Read: Priyanka Gandhi: రేపు, ఎల్లుండి తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన.. షెడ్యూల్ ఇదే
ఔటర్ రింగ్ రోడ్డుకి మెట్రో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని.. ఇస్నాపూర్ వరకు మెట్రో సౌకర్యం వస్తుందన్నారు. పటాన్ చెరు కుత్బుల్లాపూర్ లాగానే మినీ ఇండియా అని సీఎం కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ రాజ్యం ఎలా ఉంది.. బీఆర్‌ఎస్ ఎలా ఉందనేది.. పారిశ్రామిక వేత్తలు గమనించాలన్నారు. ఆనాడు కరెంట్ లేక గోసలు పడ్డారని, వలసలు ఉండేవన్నారు. పటాన్ చెరుని కాలుష్య రహితంగా చేసేందుకు కృషి చేస్తామన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఢిల్లీకి గులాం కాదన్నారు. మాకు ఢిల్లీలో బాసులు లేరు.. మాకు మీరే బాసులు అని పేర్కొన్నారు. మీరు ఆదేశిస్తే మేం పని చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో చుట్టూ పక్కల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కడుతున్నామని.. తెలంగాణ ఏర్పడ్డప్పుడు తలసరి ఆదాయంలో మన ర్యాంక్ 20 అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు దేశంలో మనమే నెంబర్ వన్ అని పేర్కొన్నారు. అసైన్డ్ భూముల్ని మేము తీసుకుంటామని కాంగ్రెస్ వాళ్లు అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. మేమే రైతులకు అసైన్డ్ భూములపై హక్కులు ఇవ్వబోతున్నామన్నారు.