Site icon NTV Telugu

CM KCR : మోడీ మా జీవోను గౌరవిస్తావా.. దాన్నే ఊరితాడు చేసుకుంటావా..?

Cm Kcr

Cm Kcr

తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా వ‌జ్రోత్స‌వాల వేడుక‌ల్లో భాగంగా సీఎం కేసీఆర్ ప‌బ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండా ఎగుర‌వేశారు. వేదిక అధ్యక్షురాలిగా మంత్రి సత్యవతి రాథోడ్ వ్యవహరించారు. ఈ సభకు భారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, గిరిజనులు, బంజారాలు హాజరయ్యారు. గిరిజనులకు గిరిజన భాషలోనే ప్రణామాలు చేశారు. అనంత‌రం రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రూ.60 కోట్లతో ఆదివాసీ బంజారా భవన్, సంత్ సేవాలాల్ ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా వుందన్నారు. చాలా సమస్యలు వున్నాయని, శాస్త్రీయ దృక్పథంతో ముందుకెళతామని, మేథోమథనం చేయాలన్నారు సీఎం కేసీఆర్‌. మీరందించే సూచనలు, సలహాలు ఇవ్వాలని, అన్ని రకాల చర్యలు ప్రభుత్వం చేపడుతుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ వచ్చి విభజన రాజకీయం నడిపిస్తున్నారని ఆయన బీజేపీపై మండిప్డడారు. గిరిజన రిజర్వేషన్ ఎందుకు అమలు కావడం లేదని, గిరిజన బిడ్డలకు న్యాయం చేయండి. ప్రధాని మోడీ పుట్టినరోజు.. ఆయనకు చేతులు జోడించి అడుగుతున్నా అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

 

మోడీ మా జీవోను గౌరవిస్తా.. దాన్నే ఊరితాడు చేసుకుంటావా అనిఆయన మండిపడ్డారు. మా బిల్లుకు రాష్ట్రపతి స్టాంప్ వేయించి పంపండని, రాష్ట్రపతిగా గిరిజన బిడ్డ వున్నారని, ఆమె ఆపరన్నారు సీఎం కేసీఆర్‌. ద్రౌపది ముర్ము వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చేయండని, రాజ్యాంగంలో ఎక్కడా కూడా 50 శాతం రిజర్వేషన్ వుండకూడదని ఎక్కడా లేదు. పక్కన తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ వుంది. ఈ సభ తీర్మానం చేస్తోంది. గిరిజనులకు రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం ఇవ్వాలి. వినపడుతోందా అమిత్ షా గారూ.. ప్రధాని నరేంద్ర మోడీ గారు. మీకు వినిపిస్తోందా? మీకున్న ప్రతిబంధకం ఏంటి? అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు.

Exit mobile version