NTV Telugu Site icon

CM KCR : వేదనలు, రోదనలతో బాధపడ్డ పాలమూరు జిల్లా ఈ రోజు సంతోషంగా ఉంది

Cm Kcr

Cm Kcr

సీఎం కేసీఆర్‌ నేడు మహబూబ్‌నగర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.55 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ… తెలంగాణలో ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ప్రజలకు మేలు జరగాలనే చేస్తున్నామని, ఏడేళ్ల క్రితం 60 వేల కోట్ల బడ్జెట్‌ మాత్రమే ఉండేదని, ఇప్పుడు 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్‌ ఖర్చు పెడుతున్నామని ఆయన వెల్లడించారు. గతంలో భయంకరమైన కరెంట్‌ బాధలు ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేదని ఆయన అన్నారు.

Also Read:Rice Farming: సఫలమైన సరికొత్త వరి వంగడం.. ఒకసారి నాట్లు వేస్తే 8 పంటలు

పాలమూరులో కొత్త కలెక్టరేట్‌ భవనం ప్రారంభించుకోవడం సంతోషమన్న సీఎం కేసీఆర్‌.. వేదనలు, రోదనలతో బాధపడ్డ పాలమూరు జిల్లా ఈ రోజు సంతోషంగా ఉందన్నారు. ఏ తెలంగాణ కోసం పోరాడామో ఆ దిశగా ముందుకు వెళ్తున్నామని, సంక్షేమ కార్యక్రమాల్లో మనమే భేష్‌ అని ఆయన వెల్లడించారు. గురుకులాలను ఇంకా పెంచుతామని ఆయన వెల్లడించారు. చాలా కష్టపడి కంటి వెలుగు కార్యక్రమాన్ని తెచ్చామని, కంటి వెలుగు ఆషామాషీగా తెచ్చిన కార్యక్రమం కాదని, కంటి వెలుగు ఓట్ల కోసం పెట్టింది కాదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా ఆలోచన చేసి తెచ్చిందేనని, సంస్కరణ అనేది అంతం కాదన్నారు. కాలానుగుణంగా కొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నామన్నారు.