NTV Telugu Site icon

CM KCR : ప్రజల అంకాక్ష నేరవేరాలంటే మంచి నాయకుడికి ఓటు వేయాలి

Cm Kcr

Cm Kcr

భద్రాద్రి కొత్తగూడెం ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్ వచ్చింది అంటే అగమ్ అగమ్ హాడవుడి చేస్తున్నారని, మోసపూరితమైన వాగ్దనాలు చేయ్యటంతో దేశం అగం అవుతుందన్నారు. ప్రజల చేతిలో ఒకే ఒక వజ్రాయుధం ఓటు.. ఓటును అగం చేయకుండా ఎన్నుకోవాలి… అప్పుడే ప్రజలు గెలుస్తారన్నారు. ప్రజల అంకాక్ష నేరవేరాలంటే మంచి నాయకుడికి ఓటు వేయాలని, పార్టీల వైఖరి, చరిత్ర చూడాలన్నారు. సింగరేణికి 134 ఏళ్ల చరిత్ర ఉందని, కాంగ్రెస్ వాళ్ళు చేతకాని దద్దములు అని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ పారిపలనలో సింగరేణి నడపలేక ఇబ్బందులు పడ్డారు.. తెలంగాణ వచ్చాక ఇప్పుడు లాభల బాట నడుస్తుంది. వడ్డిలేని రుణం కూడా ఇస్తున్నం…. 50 యేళ్ళు కాంగ్రెస్ వెనుక ఉన్నారు…10 సంవత్సరాలే మేము అధికారంలో ఉన్నం ఎంత అభివృద్ధి జరిగిందో చూడాలి మీరు… తెలంగాణ రాకముందు కరెంట్ కోతలు కరెంట్ ఉత్పత్తి అయిన కొత్తగూడెంలోనే కరెంట్ ఉండేది…కాదు. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది కరెంట్ కోతలు లేవు,వాటార్ సమస్యలు లేవు. డయాలిసిస్ పెషెంట్లకు కూడా పెన్ క్షన్ ఇస్తున్న ఘనత బీఆర్‌ఎస్‌దే. ‌మీ‌ కళ్ళ ముందు జరిగిన అభివృద్ధి ని చూడండి… సీతారామ ప్రాజెక్టు 70% పూర్తి అయింది.

కొత్తగూడెం, పాల్వంచ మునిసిపాలిటీలను బ్రహ్మండగా అభివృద్ధి చేసుకున్నం. రైతాంగం గతంలో వివక్షకు గురి అయింది.. గత పార్టీలు దళితులను ఓటు బ్యాంక్ గానే చూశారు.. ప్రతి ఒక్క దళితుడికి దళిత బందువు వస్తుంది… ప్రగతి ని చూసి గతంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో సంక్షేమం,మౌళిక వసతులు చూసి ఓటు వేయండి.. సీతారామ ప్రాజెక్టు త్వరలోనే పూర్తి అవుతుంది ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశామలంగా ఉంటుంది. వనమా వెంకటేశ్వర ను నేనే నిలబెట్టాను.. వనమా ను కాదు చూసేది…. కేసీఆర్ ను చూసి ఓటు వేయ్యండి… ఎన్నికల తరువాత కొత్తగూడెం వస్తాను…కారు గుర్తుపై ఓటు వేసి వనమా వేంకటేశ్వరావుని భారీ మెజారిటీ తో గెలిపించండి.’ అని కేసీఆర్‌ ప్రసంగించారు.