NTV Telugu Site icon

CM KCR : ‘హోన్ హై ఫాక్స్ కాన్’ కు ధన్యవాదాలు తెలిపిన సీఎం కేసీఆర్‌

Cm Kcr

Cm Kcr

అంతర్జాతీయంగా అనేక దేశాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగ ముఖ చిత్రాన్ని గుణాత్మకంగా మార్చిన గొప్ప సంస్థ ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’ తమ ఉత్పత్తి కార్యకలాపాలకు తెలంగాణ రాష్ట్రాన్ని గమ్యస్థానం గా ఎంచుకోవడం పట్ల ఆ సంస్థకు సిఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఫాక్స్ కాన్ సంస్థ భవిష్యత్తు విస్తరణ ప్రణాళికల పైన కూలంకషంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో ఫాక్స్ కాన్ సంస్థ కార్యకలాపాలకు అన్ని రకాల సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని సిఎం కేసీఆర్ ఈ సందర్భంగా చైర్మన్ యంగ్ ల్యూ కి హామీ ఇచ్చారు.

Also Read : ఉత్తర భారతంలో 10 అందమైన హిల్ స్టేషన్స్

తెలంగాణ స్వరాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి భారీగా పెట్టుబడును రప్పించడంలో తమ ప్రభుత్వం విజయవంతమైందని సిఎం అన్నారు. రాష్ట్రంలో ఫాక్స్ కాన్ ’ భారీ పెట్టుబడి పెట్టడంతోపాటు గతంలో లేని విధంగా లక్ష కు పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం రావడం గొప్ప విషయం అన్నారు. ఈ లక్ష ఉద్యోగాలను సాధ్యమైనంతవరకు స్థానిక తెలంగాణ యువతకు దక్కేలా చర్యలు చేపడుతామని ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం గురించి తమ సంస్థ విస్తృతంగా అధ్యయనం చేసిందన్నారు. ఇక్కడి పారిశ్రామిక అనుకూల వాతావరణం పైన ఫాక్స్ కాన్ చైర్మన్ ప్రశంసలు కురిపించారు. ఎనిమిది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం, పారిశ్రామిక రంగంలో, ముఖ్యంగా ఐటి, అనుబంధ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో సాధించిన అభివృద్ధి పైన ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తమ సంస్థ పెట్టుబడుల విషయంలో ఆశావాహ దృక్పథంతో ఉన్నామన్నారు.

Also Read : Seediri Appalaraju: సలహాలు ఇచ్చేది పోయి విషం చిమ్ముతావా.. చంద్రబాబుపై మంత్రి ఫైర్

Show comments