NTV Telugu Site icon

CM K.Chandrashekar Rao: రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ సమీక్ష

Cm Kcr

Cm Kcr

CM K.Chandrashekar Rao: రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్ద పీట వేయనున్నారు. ఇందుకోసం సుమారు రూ.37,000 కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం.

Ap Police Constable Exam: రేపే ఏపీలో కానిస్టేబుల్ రాతపరీక్ష.. అభ్యర్థులకు కొన్ని సూచనలు

ఆ కేటాయించిన నిధుల్లో రూ.16 వేల కోట్లు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 3 లేదా 5వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నట్టు సమాచారం. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓ కొలిక్కివచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా, నిధులు కేటాయించడంతోపాటు కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టులకు తీసుకున్న రుణాలకు అసలు, వడ్డీ తిరిగి చెల్లించేందుకు అవసరమైన నిధులనూ బడ్జెట్‌లో కేటాయించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి రాష్ట్ర బడ్జెట్‌ను మార్చి మొదటివారంలో ప్రవేశపెడుతుంటారు. అయితే సీఎం కేసీఆర్‌ కొన్ని నెలలుగా జాతీయ రాజకీయాలపై సీరియస్‌గా దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ను ముందే ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Show comments