Site icon NTV Telugu

CM KCR : ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జి.. 180 కోట్లు రిలీజ్‌

Cm Kcr

Cm Kcr

బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించిన తరువాత భారీ బహిరంగ సభను నిన్న ఖమ్మంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే.. నిన్న బహిరంగ సభలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ఖమ్మంపై వరాలు జల్లు కురింపించారు. అయితే ఈ నేపథ్యంలో ఖమ్మంలో కేబుల్‌ బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే నేడు ఖమ్మం కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.180 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి జిల్లాలోని 589 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రకటించారు సీఎం కేసీఆర్‌.

Also Read : Nepal Plane Crash: నేపాల్ విమాన ప్రమాదానికి కారణం ఇదేనా..?

పెద్ద తాండా, కల్లూరు, ఏదులాపురం, కల్లాల, నేలకొండపల్లి మేజర్‌ గ్రామ పంచాయతీలకు రూ.10 కోట్లు ఇవ్వనున్నట్టు వెల్లడించారు సీఎం కేసీఆర్‌. ఖమ్మం మున్సిపాలిటీకి ప్రత్యేకంగా రూ.50 కోట్లు, సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీలకు రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. మంత్రి అజయ్‌ వినతి మేరకు మునేరు నదిపై కొత్త బ్రిడ్జి, ఖమ్మంలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు నెలరోజుల్లోపు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్‌.

Also Read : Driving Skills: వీడి డ్రైవింగ్ వేరే లెవల్.. నిపుణుల పర్యవేక్షణలోనే ఇలాంటివి చేయాలి

Exit mobile version