Site icon NTV Telugu

CM KCR : ఫారెస్ట్‌ రేంజర్‌ శ్రీనివాసరావు మృతిపై స్పందించిన కేసీఆర్‌.. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా

Cm Kcr

Cm Kcr

భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పోడు భూముల వ్యవహారంలో చోటు చేసుకు ఘర్షణ ఓ రేంజర్‌ ప్రాణాలను బలిగొంది. గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సీఎం కేసీఆర్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దోషులకు కఠినంగా శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. మరణించిన ఎఫ్ఆర్‌వో కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌ గ్రేషియాను సీఎం ప్రకటించారు. దాడిలో మరణించిన శ్రీనివాసరావు డ్యూటీలో వుంటే ఏవిధంగానైతే నిబంధనల ప్రకారం జీతభత్యాలు అందుతాయో అవే నిబంధనల ప్రకారం ఆయన కుటుంబానికి పూర్తి వేతనాన్ని అందించాలని, రిటైర్ మెంట్ వయస్సు వరకు వారి కుటుంబ సభ్యులకు ఈ వేతనం అందచేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.
Also Read : Bandi Sanjay : కేంద్రం ఉద్యోగాలు ఇస్తుంటే… ఈ ప్రభుత్వం ఉద్యోగాలు తొలగిస్తుంది

కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఎఫ్ఆర్‌వో పార్థివ దేహానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. అటవీశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు ఎఫ్ఆర్‌వో అంత్యక్రియల్లో పాల్గొని సంబంధిత ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పై దాడులను ఏమాత్రం సహించబోమని సీఎం స్పష్టం చేశారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం అండగా వుంటుందని ఎలాంటి జంకు లేకుండా తమ విధిని నిర్వర్తించాలని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.
Also Read : Megastar Chiranjeevi: అప్పుడు అవమానించారు.. ఇప్పుడు అవార్డు ఇస్తున్నారు

Exit mobile version