Site icon NTV Telugu

Yasangi : యాసంగి మొక్కజొన్న కొనుగోలుకు సర్కారు నిర్ణయం

Kcr Speech

Kcr Speech

యాసంగి మొక్కజొన్న కొనుగోలుకు తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. తక్షణం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. యాసంగిలో దాదాపు 6.50 లక్షల ఎకరాలలో మొక్కజొన్న సాగు జరిగిందని, 17.37 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో ప్రధానంగా మొక్కజొన్న సాగు జరిగిందని, మొక్కజొన్న క్వింటాలుకు ప్రభుత్వ మద్దతుధర రూ.1962లు ప్రకటించారు సీఎం కేసీఆర్‌.

Also Read : JioCinema: జియో సినిమా బిగ్ డీల్.. ఇకపై హెచ్‌బీఓ , వార్నర్ బ్రదర్స్ కంటెంట్..

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశింశారు. రెండు వారాల క్రితమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు ప్రారంభించారు. అయితే.. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 7,100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ క్రమంలో.. రాష్ట్ర వ్యాప్తంగా ఆకాల వర్షాలకు పంటలు మొత్తం దెబ్బ తిన్నాయి. వాటిలో ప్రధానంగా వరి పంటనే అత్యధికంగా దెబ్బతిని రైతన్నకు తీరని నష్టాన్ని మిగిల్చింది.

Also Read : Ram Navami violence: రామనవమి హింసపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. ఎన్ఐఏ దర్యాప్తుకు ఆదేశం…

Exit mobile version