NTV Telugu Site icon

TRS Munugodu Sabha : అభ్యర్థిని ప్రకటించకుండానే ముగిసిన కేసీఆర్‌ ప్రసంగం

Kcr

Kcr

CM KCR Not Announced Munugodu TRS Candidates

తెలంగాణలో రాజకీయం ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం చుట్టు తిరుగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో అక్కడి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా.. టీఆర్‌ఎస్‌ మునుగోడు ప్రజాదీవెన పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభటో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొని ప్రసంగిస్తూ.. వ్యవసాయ కరెంటు మోటార్లకు కేంద్రం ఎందుకు మీటర్లు పెట్టమంటున్నదో చెప్పాలని అన్నారు సీఎం కేసీఆర్‌. కారణాలు ఏంటో చెప్పాలని నిలదీశారు సీఎం కేసీఆర్‌. ఎందుకు పెట్టమంటున్నవ్‌ మీటర్‌.. ఏం కారణం.. నిన్ను మేం అడుగుతలేమే.. నిన్ను బతిమిలాడినమా పైసలు ఇవ్వమని అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇదే నల్లగొండ జిల్లా, పాలమూరు, అనేక ఇతర జిల్లాల్లో పది, ఇరవై ఎకరాలు ఉన్నవాళ్ల హైదరాబాద్‌కు వచ్చి ఆటోలు నడిపారని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. ఆ రోజు ఏడ్చాం.. బాధపడ్డాం.. మా ప్రాజెక్టులు కాలే.. మాకు నీళ్లు రాలే.. కరెంటు రాదు.. చెట్టుకొకరు గుట్టకొకరు అయ్యారు రైతాంగమంతా అని బాధపడ్డామన్నారు సీఎం కేసీఆర్‌.

 

ఇవాళ ఏ ప్రయత్నమన్న చేసే మళ్లీ గ్రామాలు పచ్చబడాలే.. రైతులు బాగుపడాలే.. గ్రామం సల్లగుంటే.. రైతు వద్ద నాలుగు పైసలు ఉంటే.. రైతు ధాన్యంపండిస్తే బ్రహ్మాండంగా ఉంటుందని తిప్పలు పడుతున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. అయితే.. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో జరిగిన ఈ సభలో టీఆర్‌ఎస్‌ తరుఫున ఎవరూ బరిలోకి దిగుతున్నారనే ప్రశ్నకు సమాధానం రాలేదు. మునుగోడు ఉప ఎన్నిక పోటీలో టీఆర్‌ఎస్‌ పార్టీ తరుఫున ఎవరు నిలుస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో సభకు వచ్చిన వారు కొందరు నిరాశతోనే వెనుదిగారు. అయితే.. మునుగోడు టీఆర్‌ఎస్‌ లో అంతర్గత విభేదాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో రెండు వర్గాలు టీఆర్ఎస్‌ నేతలు ఉన్నట్లు.. కొందరు అసమ్మతి నేతలతో ఇప్పటికే మంత్రి జగదీష్ రెడ్డి చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో.. ఈ విషయాన్ని సరాసరి సీఎం కేసీఆర్‌ ముందు పెట్టారు. అయితే.. సీఎం కేసీఆర్‌ ఆదేశించినా.. పార్టీనేతల్లో అసమ్మతి సెగలు రగులుతున్నాయనేది భోగట్ట.