జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతం చేసే దిశంగా బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రేపు మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. అయితే.. ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ క్రమంలో.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు బేగం పోర్ట్ ఎయిర్‌పోర్ట్ నుంచి కేసీఆర్ బయలు దేరనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటకు ప్రత్యేక విమానంలో నాందేడ్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. దిగిన తరువాత వాహనంలో వెళ్లి గురుద్వార్ దర్శనం చేసుకుంటారు. దర్శనం తరువాత 1.30 గంటలకు గురుద్వార సచ్ ఖండ్ బొడ్ మైదాన్ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. అంతేకాకుండా.. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జడ్పీసభ్యులు, మాజీ సర్పంచ్ లు.. ఇలా మొత్తం 60 మంది నేతలను కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానిస్తారని పార్టీ శ్రేణులు తెలిపారు. అంతేకాకుండా.. భారీ సంఖ్యలో చేరికలు ఉంటాయని నేతలు వెల్లడించారు. చేరికల తరువాత 4గంటలకు ప్రెస్ మీట్ ఉంటుందని, మీడియా తో చిట్ చాట్ నిర్వహిస్తారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. తరువాత తిరిగి హైదారాబాద్ కు కేసీఆర్ పయనం కానున్నారు.
Also Read : India: భారతదేశంలోని టాప్-10 రిచెస్ట్ నగరాలు
ఇదిలా ఉంటే.. ఆదివారం జరగనున్న బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభకు ముందు నాందేడ్ పట్టణంలోని రోడ్లన్నీ బీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు, కేసీఆర్ హోర్డింగ్‌లు, బ్యానర్‌లతో గులాబీమయంగా మారాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ప్రధాన రాజకీయ పార్టీల జాతీయ నేతల సమక్షంలో జరగనున్న బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ భారీ బహిరంగ సభ ఏర్పాట్ల కోసం తెలంగాణ అటవీ, పర్యావరణ, న్యాయ, రెవెన్యూ శాఖల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, షకీల్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ ఉండి రవీందర్ సింగ్ గత కొద్ది రోజులుగా నాందేడ్‌లో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Also Read : Agniveer recruitment: అగ్నివీర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మార్చిన సైన్యం.. వివరాలు ఇవే..
