Site icon NTV Telugu

CM KCR : రాక్షసుల కుట్రను బద్దలుకొట్టాలని ఆ ముఠాను పట్టుకున్నాం

Cm Kcr

Cm Kcr

దేశంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయన్నారు సీఎం కేసీఆర్‌. ఇటీవల మొయినాబాద్‌లో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి ఫాంహౌస్‌లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తాజాగా సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యం హత్య జరుగుతోంది.. చాలా బాధాకరమైన పరిస్థితి ఉంది.. దేశాన్ని బీజేపీ సర్వనాశనం చేసిందన్నారు. ఎనిమిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేశారు.. దేశాన్ని ఆకలి రాజ్యంగా మార్చారు… మునుగోడు ఉప ఎన్నిక కోసం ఇప్పటిదాకా ఆగాను… ఇప్పుడు షో చూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ హైకోర్టుకు ఇప్పటికే ఫామ్‌హౌస్‌ ఫైల్స్‌ పంపించామని, అన్ని రాష్ట్రాల సీఎంలకు, పార్టీల అధ్యక్షులకు వీడియోలు పంపుతాను.. దేశంలోని అన్ని హైకోర్టులకు, సుప్రీంకోర్టుకు వీడియోలను పంపుతున్నామన్నారు సీఎం కేసీఆర్‌. 8 ఏండ్ల క్రితం బీజేపీ అధికారంలోకి వ‌చ్చి దేశాన్ని అన్ని రంగాల్లో స‌ర్వ‌నాశ‌నం చేసింది.

Also Read :Live : సీఎం కేసీఆర్ కీలక ప్రెస్ మీట్
రూపాయి ప‌డిపోయిందని, నిరుద్యోగం తాండ‌విస్తుందని, ఆక‌లి రాజ్యంగా మారుతోంది ఇండియా అని సీఎం కేసీఆర్‌ అన్నారు. అంత‌ర్జాతీయ సూచిక‌లు మంచి చెడును చూపిస్తున్నాయని, దేశ విభ‌జ‌న‌, ప్ర‌జ‌ల‌ను విభ‌జించడం.. భార‌త ప్ర‌జాస్వామ్య నాడీని క‌లుషితం చేస్తున్నాయని, చాలా దారుణ‌మైన ప‌ద్ధ‌తుల్లో పోతున్నారన్నారు. నేను కూడా బాధ‌కు గుర‌య్యాను అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ రాక్షసుల కుట్రను బద్దల కొట్టాలని ఆ ముఠాను పట్టుకున్నామన్నారు సీఎం కేసీఆర్‌.
ఈ రోజు మునుగోడు పోలింగ్ ముగిశాకనే ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌నే ఆలోచ‌న‌తో వెయిట్ చేశామని, మునుగోడులో కూడా వెకిలి ప్ర‌య‌త్నాలు చేశారని, చేతుల్లో పువ్వు గుర్తులు, ఫేక్ ప్ర‌చారాలు చేశారన్నారు సీఎం కేసీఆర్‌.

Exit mobile version