Site icon NTV Telugu

Cm Kcr: భారత్ భవన్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

Kcr On Kokapet

Kcr On Kokapet

హైదరాబాద్ లోని కోకాపేటలో భారత్ భవన్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భారత్ భవన్ సెంటర్ పర్ ఎక్స్ లెన్స్ అండ్ హెచ్ఆర్డీగా భవనానికి నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నాతాధికారులు పాల్గొన్నారు. కోకాపేటలో మొత్తం 11 ఎకరాల్లో 15 అంతస్తుల్లో ఈ భవనం నిర్మిస్తున్నారు. కార్యకర్తలకు అవగాహనా కార్యక్రమాలు, శిక్షణా తరగతులు నిర్వహించేలా ప్లాన్ చేశారు. కోకాపేటలో అత్యంత విలువైన భూమిని తక్కువ ధరకు బీఆర్ఎస్ కు కేటాయిస్తు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేవలంలో ఐదు రోజుల్లోనే భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Also Read : Vijay: CSK టైటిల్… Leo టీజర్… సోషల్ మీడియా అంతా మీ హంగామానే ఉందిగా

భారత్ భవన్ సెంటర్ పర్ ఎక్స్ లెన్స్ అండ్ హెచ్ఆర్డీ భవనంలో అతి పెద్ద డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నారు. స్టేట్‌ ఆర్ట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌, డిజిటల్ లైబ్రరీతో పాటు ఇక్కడ శిక్షణ పొందేవారికి, పనిచేసే సిబ్బందికి సదుపాయాలు కల్పించనున్నారు. భారత్‌ భవన్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత కేసీఆర్‌ అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడి జాతీయ కార్యాలయం నుంచి బీఆర్‌ఎస్‌ పనులు చూసుకుంటారు. మిగతా సమయాల్లో భారత్‌ భవన్‌ నుంచే పార్టీ పనులన్నీ చక్కబెట్టనున్నట్లు సమాచారం.

Also Read : Wife Killed Husband : మహాతల్లి.. మొగుడిని వాకింగ్‎కని తీసుకెళ్లి వాచేటట్టు కొట్టి చంపించింది

ఇప్పటికే బీఆర్‌ఎ్‌సకు ఇప్పటికే బంజారాహిల్స్‌లో భారీ విస్తీర్ణంలో ప్రధాన కార్యాలయం, 33జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాలకు స్థలాలు ఉన్నా.. మళ్లీ 11 ఎకరాల భూమిని కేటాయించుకోవడం గమనార్హం. అయితే కోకాపేటలో చదరపు గజం రూ.లక్ష నుంచి లక్షన్నర పలుకుతుండగా..ప్రభుత్వం కేవలం చదరపు గజం రూ.7500 చొప్పున 11 ఎకరాలను బీఆర్‌ఎ్‌సకు కట్టబెట్టింది. హెచ్‌ఎండీఏ లెక్కల ప్రకారం చూసుకుంటే ఇది రూ.500 కోట్ల స్థలం. కానీ, కేవలం రూ.40 కోట్లకే ప్రభుత్వం తమ పార్టీకి కేటాయించుకోవడంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version