NTV Telugu Site icon

CM KCR: ప్రగతి భవన్ లో కీలక సమావేశం.. రాష్ట్రపతి ఎన్నికపై చర్చ

Untitled 1 Copy

Untitled 1 Copy

తెలంగాణ పాలిటిక్స్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ తో పాటు మంత్రులు, లోక్ సభ, రాజ్యసభ, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లు, విప్ లతో కీలక సమావేశం జరుగుతోంది. ముఖ్యంగా కేంద్రం అనుసరిస్తున్న తీరుతో పాటు రాష్ట్రపతి ఎన్నికల గురించి ప్రధాన చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై ప్రధానంగా చర్చ సాగుతోంది.

ఇటీవల కాలంలో బీజేపీకి వ్యతిరేఖంగా కూటమి ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్ పలు రాష్ట్రాల్లోని ప్రముఖ నాయకులను కలుస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసిన కేసీఆర్ రానున్న రోజుల్లో సంచలనం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఇదే విధంగా ఇటీవల కర్ణాటక బెంగళూర్ లో మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని కలిశారు. ఆ సమయంలో కూడా రాష్ట్రపతి ఎన్నికల గురించి ప్రధానంగా చర్చ జరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే విపక్షాలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని రాష్ట్రపతి ఎన్నికలను నిలిపితే ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం దీంతో పాటు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రపతి ఎన్నికలు కీలకంగా మారాయి. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేఖంగా కూటమి కట్టే ప్రయత్నాల్లో టీఆర్ఎస్ పార్టీ ఉంది. కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు విపక్షాలన్నీ ఒకే కూటమిగా ఏర్పడి ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటిస్తాయా.? అనేది కీలకం మారింది. కాంగ్రెస్ పార్టీని కాదని బయటకు వచ్చే పార్టీలు ఎన్ని ఉంటాయనేది ప్రస్తుతానికి సస్పెన్సే. ఇదిలా ఉంటే బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే అభ్యర్థి సునాయసంగా గెలుస్తాయనే వాదనలు కూడా ఉన్నాయి. ఎన్డీయే నుంచి శివసేన, అకాలీదళ్ వెళ్లినా.. ఓడిశాలోని బిజూ జనతాదళ్, ఏపీలోని వైసీపీలు బీజేపీకి సహకరించేందుకు సముఖంగా ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇటువంటి ఈక్వేషన్ల నేపథ్యంలో తాజాగా ప్రగతి భవన్ లో కీలక చర్చ సాగుతోంది.