NTV Telugu Site icon

CM KCR : నేడు జగిత్యాలకు సీఎం కేసీఆర్‌.. మినిట్ టూ మినిట్ షెడ్యూల్

Cm Kcr

Cm Kcr

సీఎం కేసీఆర్‌ జగిత్యాల జిల్లాలో నేడు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుండి సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్ ద్వారా జగిత్యాల చేరుకుంటారు. 12 గంటల 30 నిమిషాలకు జగిత్యాల జిల్లాలో సమీకృత అధికారుల కార్యాలయం వద్ద ఉన్న హెలిప్యాడ్ కు వచ్చి… 12 గంటల 40 నిమిషాలకు టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తారు. ఒంటి గంటకు జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతన మెడికల్ కళాశాలకు శంకుస్థాపన.. 1.15 నిమిషాలకు సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభం చేస్తారు సీఎం కేసీఆర్‌. అనంతరం జిల్లా అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. తర్వాత అక్కడే లంచ్ ఏర్పాటు ఉంటుంది. 3 గంటల 10 నిమిషాలకు రోడ్ వే ద్వారా ప్రత్యేక బస్సులో జగిత్యాల జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న మోతె గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరు అవుతారు సీఎం కేసీఆర్‌. 4 గంటల 15 నిమిషాలకు జగిత్యాల నుండి తిరిగి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం కేసీఆర్‌.
Also Read : What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

అయితే.. సభ ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్షిస్తున్నారు. జగిత్యాల, ధర్మపురి సిరిసిల్ల, వేములవాడ సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, కరీంనగర్, పెద్దపల్లి, అదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్ నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నియోజకవర్గల నుండి జనసమీకరణ చేస్తున్నారు గులాబీ నేతలు. సుమారు ఐదు జిల్లాల నుండి 2 లక్షలతో భారీ బహిరంసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు.. ఎస్పీ సింధు శర్మ నేతృత్వంలో 2,325 మందితో భారీ బందోబస్తు మోహరించనున్నారు. 7 గురు అడిషనల్ ఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 44 మంది సీఐలు, ముగ్గురు మహిళా సీఐలు, 165 ఎస్ఐలు, 13 మంది మహిళా ఎస్సైలతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇదిలా ఉంటే.. స్థానిక విపక్ష నేతలను ముందస్తుగా అరెస్ట్‌ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే.. బీజీపీ, కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు హౌజ్‌ అరెస్ట్‌ చేశారు.