Site icon NTV Telugu

CM KCR : సీఎం కేసీఆర్‌ దసరా కానుక.. ఎస్టీ రిజర్వేషన్ల పెంపు

Cm Kcr

Cm Kcr

CM KCR Increased ST Reservations in Telangana

తెలంగాణలో గిరిజనులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. ఎస్టీలకు రిజర్వేషన్లలో 10శాతం కల్పిస్తూ జీవో 33 జారీ చేశారు. నేటి నుంచే అమలు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో ప్రత్యేక పరిస్థితి.. గిరిజనులు అధికం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ సర్కార్‌ వెల్లడించింది. రిజర్వేషన్‌ పెంచాలంటూ చెల్లప్ప కమిటీ సిఫారసు చేసింది. ఆరేండ్ల క్రితమే అసెంబ్లీలో బిల్లు.. కేంద్రం నాన్చివేత ధోరణి కారణంగా తెలంగాణ ప్రభుత్వమే రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంది. అయితే.. ప్రత్యేక సందర్భాల్లో 50 శాతం దాటొచ్చన్న సుప్రీంకోర్టు ఆదేశాల ఉన్నా నరేంద్ర మోదీ సర్కార్‌ స్పందించలేదు. దీంతో.. 4 శాతం పెంచుతూ కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాకుండా.. 3,146 తండాలు, గూడేలకు గ్రామ పంచాయతీ హోదా కల్పిస్తూ తెలంగాణ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. స్థానిక ప్రజా ప్రతినిధులుగా 27,682 మందికి అవకాశం కల్పించింది. విద్యాభివృద్ధి కోసం 92 ఎస్టీ ప్రత్యేక గురుకులాల ఏర్పాటు, యువ గిరిజన పారిశ్రామిక వేత్తలకు సీఎంఎస్‌టీఈ పథకం, హైదరాబాద్‌లో కుమ్రం భీం, సంత్‌ సేవాలాల్‌ భవనాలు, మేడారం జాతరకు అధికారిక హోదా.. సమ్మక్క మ్యూజియం లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలంగాణ సర్కార్‌ వెల్లడించింది.

 

Exit mobile version