NTV Telugu Site icon

CM KCR: మరో వారం వరకూ భారీ వర్షాలు.. బీ అలర్ట్

Kcr New

Kcr New

తెలంగాణలో మరో వారం పాటు ప్రజలు అప్రమత్తంగా వుండాలన్నారు సీఎం కేసీఆర్. ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలన్నారు. స్వీయ రక్షణ పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి. గోదావరి ఉప నదుల్లో కూడా భారీ వరద వచ్చే ప్రమాదం వుంది. ఉద్యోగులు హెడ్ క్వార్టర్లు విడిచి వెళ్ళకూడదు. రేపటికే తిరిగి గోదావరి ప్రవాహం ఉధృతం కానుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇపుడు కురిసే వానలతో గోదావరి నది రేపు మధ్యాహ్నం నుంచే ఉధృతంగా మారే ప్రమాదo వుందన్నారు.

ఈ భారీ వానలు అగస్టు మొదటివారం దాకాకొనసాగే అవకాశం వుందని హెచ్చరించారు. రామన్నగూడెం …ఏటూరునాగారం …భధ్రాచలంలలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. రెండు హెలికాప్టర్లను సిద్దం చేయాలన్నారు. రాష్ట్ర రాజధానిలో ఉండే హెలికాప్టర్ కు అదనంగా మరో రెండు హెలికాప్టర్లు వుండాలన్నారు. ములుగులో ఒకటి, కొత్తగూడెంలో ఒకటి సిద్దంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్ సహా వరద సహాయక బృందాలను అందుబాటులో ఉంచాలి. వచ్చిన వరదను వచ్చినట్టే వదలాలన్నారు సీఎం కేసీఆర్.

గోదావరి నుంచి వచ్చిన వరదను ప్రాజెక్టుల గేట్లను ఎత్తి కిందికి వదలాలన్నారు సీఎం కేసీఆర్. ఇన్ ఫ్లో ఎంత వస్తున్నదో అంతనీటిని అవుట్ ఫ్లో ద్వారా విడుదల చేయాలి. వరదల పరిస్థితిని ముందస్తు అంచనా కోసం సాప్ట్ వేర్. ఇరిగేషన్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లడ్ ఫోర్ కాస్టింగ్ అండ్ మేనేజ్ మెంట్ సిస్టమ్ అనే సాంకేతిక పరిజ్జానాన్ని వాడాలన్నారు సీఎం కేసీఆర్. వరద పరిస్థితిని శాటిలైట్ ఆధారంగా రికార్డు చేసి విశ్లేషించే విధానాన్ని వినియోగించుకోవాలన్నారు సీఎం కెసిఆర్.

Missing Pet Parrot Found: పెంపుడు చిలుకను పట్టించినందుకు రూ. 85,000 బహుమానం.. ఎక్కడో తెలుసా..?

Show comments