నల్లగొండ జిల్లా నకిరేకల్ నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యమకారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ఆయన ఆరోపించారు. అనేక మంది బలిదానాల తరువాత తెలంగాణ వచ్చిందని, ప్రభుత్వానికి నష్టం వచ్చినా ధాన్యం కొనుగోలు ఆపలేదన్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ ధరణి స్థానంలో కాంగ్రెస్ భూమాత తీస్తుందట, అది భూమాత నా…. భుమేత నా.. అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో కరువు కాటకాలు.. ఎమర్జెన్సీ తప్ప ఏమీ లేవని, ఇందిరమ్మ రాజ్యం వైఫల్యం వల్లే ఎన్టీఆర్ వచ్చారు.. ఎన్టీఆర్ సంక్షేమం, అభివృద్ధి ప్రారంభమైందన్నారు.
Also Read : Supreme Court: మరో రాష్ట్రంలో ఎఫ్‌ఐఆర్ చేసినా.. ముందస్తు బెయిల్ మంజూరు చేయవచ్చు..
కమ్యూనిస్ట్ లు నకిరేకల్ లో బీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వండని ఆయన కోరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నానని ఆయన వెల్లడించారు. నాకంటే పొడుగు, లావు ఉన్న నేతలు అధికారంలో ఉండి నల్లగొండను కరువు కొరల్లోకి నెట్టేశారని, రెండు దశాబ్దాలుగా నల్లగొండ నియోజకవర్గం వెనుకబాటుకు గురయిందన్నారు కేసీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు, 24 గంటల కరెంట్, ధరణి ఉండవని, కాంగ్రెస్ ఏనాడు రైతు మేలు కోరలేదన్నారు. 5 గంటల కరెంట్ కావాలా.. 24గంటల నాణ్యమైన కరెంట్ కావాలో ప్రజలు తేల్చుకోవాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి డబ్బు అహంకారంతో మాట్లాడుతున్నారని, నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధి నా ఆధ్వర్యంలో కొనసాగుతుందన్నారు. నా దత్తత పూర్తి కాలేదన్నారు సీఎం కేసీఆర్.
Also Read: Koti Deepotsavam LIVE : మొట్టమొదటిసారిగా అగ్నిలింగ క్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి కల్యాణం