దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని దేశ ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకొంటారని సీఎం అన్నారు. అజ్ఞానాంధకారాన్ని పారదోలి జ్ఞానపుకాంతులు ప్రసరింప చేయడమనే తత్వాన్ని దీపావళి మనకు నేర్పుతుందన్నారు.తెలంగాణ మాదిరే, దేశ ప్రజలందరి జీవితాల్లో ఆనందపు ప్రగతి కాంతులు వెల్లివిరియాలని, సుఖ శాంతులతో సిరి సంపదలతో తుల తూగాలని, దీపావళి సందర్భంగా సీఎం కేసిఆర్ ఆకాంక్షించారు.
Also Read : Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బిగ్ ట్విస్ట్.. నిరాశలో ఫ్యాన్స్..?
బాణా సంచా వెలిగించే సందర్భంలో ప్రమాదాలకు గురికాకుండా, భక్తి శ్రద్ధలతో పర్యావరణ హితంగా దీపావళి పండుగను జరుపుకోవాలని ప్రజలను, సీఎం కేసీఆర్ కోరారు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగను ఘనంగా చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా ప్రజలు దీపావళి పండుగను పూర్తిస్థాయిలో జరుపుకోలేదు. అయితే.. ఈ ఏడాది దివ్వకాంతుల నడుమ దీపావళి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. ఈనెల 25న సూర్యగ్రహణం ఉండటంతో.. సోమవారం రోజునే దీపావళి జరుపుకోవాలని రాష్ట్రప్రభుత్వం, వేదపండితులు సూచించారు.
