ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బిజీబిజీగా వున్నారు. దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్‌ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన రాజశ్యామల యాగం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ రాజశ్యామల యాగం కోసం ఇప్పటికే ప్రత్యేక యాగశాలను నిర్మించారు. అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. బీఆర్‌ఎస్ నేతలు, ఋత్విక్కులు ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు 12 మంది ఋత్విక్కులు గణపతి పూజతో రాజశ్యామల యాగాన్ని మొదలు పెట్టనున్నారు.
ఇప్పటికే వారు ఢిల్లీకి చేరుకున్నారు. పుణ్యహవాచనం, యాగశాల ప్రవేశం, చండీపారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహించనున్నారు. రేపు (బుధవారం) నవ చండీహోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. శృంగేరిపీఠం గోపీకృష్ణశర్మ, ఫణి శశాంకశర్మ ఆధ్వర్యంలో హోమాలు జరగనున్నాయి. శృంగేరి పీఠం గోపీకృష్ణ శర్మ, ఫణి శశాంక శర్మ ఆధ్వర్యంలో జరగనున్నాయి యాగాలు… దైవ కృప ,బీఆర్ఎస్ విజయవంతం కావడం ,దేశం సుభిక్షంగా ఉండటానికి యాగాన్ని నిర్వహిస్తున్నారు కేసీఆర్.
అంతకుముందు ఢిల్లీకి చేరుకున్న కేసీఆర్ కు ఘన స్వాగతం లభించింది. బీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. సీఎం కేసీఆర్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, లోక్‌సభలో బీఆర్‌ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, ఎంపీలు సంతోష్‌కుమార్, దీవకొండ దామోదర్‌రావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, రంజిత్‌రెడ్డి, పీ రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, పార్థసారథిరెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తదితరులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఢిల్లీలో బీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
Read Also: Italy Shooting: ఇటలీ కేఫ్‌లో కాల్పులు.. ప్రధాని ఫ్రెండ్ మృతి
ఈకార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభానికి వివిధ రాష్ర్టాల నుంచి బీఆర్‌ఎస్ మద్దతుదారులు తరలివచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ విధి విధానాలను కూడా కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Also: Okkadu: మహేష్‌ను మాస్ హీరోగా నిలబెట్టిన సినిమాకి 20 ఏళ్లు
