NTV Telugu Site icon

Mir Barket Ali Khan : అధికారిక లాంఛనాలతో ముకర్రమ్ ఝా అంత్యక్రియలు

Mir Barket

Mir Barket

హైదరాబాద్ సంస్థానం ఆఖరి నిజాం ‘మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్’ గారి మనుమడు, నిజాం పెద్దకొడుకు ఆజమ్ ఝా, దుర్రె షెహవార్ దంపతుల కుమారుడు ముకర్రమ్ ఝా (Mukarram Jah) మరణం పట్ల సీఎం కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.నిజాం వారసుడుగా, పేదల కోసం విద్య, వైద్య రంగాల్లో ముకర్రమ్ ఝా చేసిన సామాజిక సేవలకు గుర్తుగా, వారి అంత్యక్రియలను అత్యున్నతస్థాయి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. టర్కీలోని ఇస్తాంబుల్ లో శనివారం రాత్రి మరణించిన ముకర్రమ్ ఝా పార్థివ దేహం హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత, వారి కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు అంత్యక్రియల సమయాన్ని, స్థలాన్ని నిర్ధారించి తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు ఏ.కె.ఖాన్ ని సీఎం సూచించారు.

Also Read : Rajamouli: ప్రభాస్ తో పోల్చడం తప్పే.. ఆయనను కించపరచడం నా ఉద్దేశం కాదు

ఇదిలా ఉంటే.. మీర్ బర్కెట్ అలీ ఖాన్ వాలాషన్ ముకర్రం జహ్ బహదూర్ అక్టోబరు 6, 1933న టర్కీ చివరి సుల్తాన్ (ఒట్టోమన్ సామ్రాజ్యం) సుల్తాన్ అబ్దుల్ మెజిద్ II కుమార్తె, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు ఆజం జా మరియు యువరాణి దురు షెహ్వార్‌లకు జన్మించాడు. డెహ్రాడూన్‌లోని డూన్ స్కూల్‌లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తర్వాత, అతను కేంబ్రిడ్జ్‌లోని హారో మరియు పీటర్‌హౌస్‌లో చదువుకున్నాడు. అతను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మరియు రాయల్ మిలిటరీ అకాడమీ శాండ్‌హర్స్ట్‌లో కూడా చదువుకున్నాడు.

Also Read : Rajamouli: ప్రభాస్ తో పోల్చడం తప్పే.. ఆయనను కించపరచడం నా ఉద్దేశం కాదు