NTV Telugu Site icon

CM KCR: ధరణి తీసేస్తా అన్నోడిని బంగాళాఖాతంలో వెయ్యాలి..

Kcr On Darani

Kcr On Darani

మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. జిల్లాలోని కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఇక, సీఎస్ఐ చర్చ గ్రౌండ్ లో నిర్వహించిన ప్రగతి శంఖారావంలో ఆయన మాట్లాడుతూ.. మెదక్ కి రింగ్ రోడ్డు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే, రామాయంపేట్ ను రెవెన్యూ డివిజన్ చేస్తామని పేర్కొన్నారు. ఏడు పాయల ఆలయానికి అభివృద్ధి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని సీఎం చెప్పారు. జిల్లాలో 469 గ్రామ పంచాయతీలకు ప్రతి గ్రామానికి 15 లక్షల నిధులు కేటాయిస్తున్నాం.. మెదక్ మున్సిపాలిటికి రూ.50 కోట్లు.. మిగతా మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు.

Read Also: Pawan Kalyan: మన అంతరిక్ష చరిత్రలో సువర్ణ అధ్యాయం

వడ్ల కల్లాలు లేచినప్పుడు అడుక్కు తినే వాళ్ళు వస్తారు.. అందరి మాట విని ఆగం కావద్దు అని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఒక్క చాన్స్ అంటుంది.. 50 ఏళ్లు మీరే పాలించారు ఇంకా ఒక్క చాన్స్ ఎందుకు.. సింగూరు ప్రాజెక్టుని హైదరాబాద్ కి దత్తత ఇచ్చి మన మెదక్ జిల్లాకి ఎండబెట్టారు.. ఇప్పుడు మన నీళ్లు మనమే వాడుకుంటున్నాం అని ఆయన అన్నారు. తెలంగాణ రాక ముందు చెట్టుకు ఒకడు పుట్టకు ఒకడు అయ్యాం.. తెలంగాణ వచ్చాక పరిస్థితి మారిపోయింది.. బావుల కాడ మీటర్లు పెట్టలేదని రూ. 25 వేల కోట్లు నష్టం బీజేపీ కలిగించింది అని కేసీఆర్ ఆరోపించాడు.

Read Also: PM Modi on Chandrayaan-3: ఈ విజయం దేశం గర్వించే మహోన్నత ఘట్టం

కర్ణాటకలో గెలిచిన కంగ్రెస్ తెల్లరే దుకాణం బంద్ చేసింది అని సీఎం కేసీఆర్ అన్నారు. 50 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ఏనాడు మంచి నీళ్ళు ఇయ్యలే.. మిషన్ భగీరథ తెచ్చి ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తున్నాం.. ఒక కోటి 3 లక్షల మందికి నల్ల కనెక్షన్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం పేర్కొన్నారు. వాళ్లకు రాష్ట్రం అప్పగిస్తే ఆగం అవుతాం.. కాంగ్రెస్ వాళ్లు ధరణి తీసేస్తాం అంటున్నారు.. ధరణి తీసేస్తే రైతుల అధికారం పోతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ధరణి ఉంటే మీ భూమిని సీఎం కూడా మార్చలేడు.. తీసేస్తే అధికారుల దగ్గర పోతుంది.. ధరణి పోతే పెద్ద పాము మింగినట్టు అయితదని కేసీఆర్ చెప్పారు.

Read Also: Etela Rajender: తెలంగాణలో ప్రజల కష్టాలు పోవాలంటే ఆయన ఇంటికి పోవాల్సిందే..!

రైతు భీమా ఇచ్చే ఏకైక రాష్టం తెలంగాణ.. వడ్లు అమ్మితే మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని కేసీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు చేసి ఇబ్బంది పెట్టింది.. అయినా రుణమాఫీ చేసినం.. ధరణి తీసేస్తా అన్నోడిని బంగాళాఖాతంలో కలపాలి.. మహారాష్ట్ర రైతులు కూడా తెలంగాణ తరహా పాలన కోరుకుంటున్నారు.. ఒకడు మీటర్ పెట్టాలి అంటాడు.. ఇంకొకడు 3 గంటల కరెంట్ చాలు అంటాడు.. వ్యవసాయం చేసిన మొహామేనా నీది.. మూడు గంటల సరిపోతదా.. కాంగ్రెస్ వాళ్లు ఆపద మొక్కులు మొక్కుతారు అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Raashii Khanna: ది సోల్ ఆఫ్ సత్య.. ఎంత ముద్దుగా పాడావ్ బంగారం

ఆనాడు 200 పెన్షన్ ఇచ్చినోడు.. ఇప్పుడు 4000 పెన్షన్ ఎలా ఇస్తారు అని కేసీఆర్ అడిగారు. ఇచ్చే మొఖమేన నీది.. చెప్పాలంటే ఎన్నో చెప్పవచ్చు.. రైతుల ఆత్మహత్యలు లేవు.. ఇండియాలో మనమే నెంబర్-1.. పదేళ్ల కింద తెలంగాణ ఎట్లుండే.. ఇయ్యలా ఎట్లున్నది గమనించాలి.. మన పథకాలు ఇతర రాష్ట్రాల్లో కావాలని అడుగుతున్నారు.. సిద్దిపేట ఎలా ఉందో మెదక్ కూడా అలా కావాలి.. మోసకరుల మాటలు నమ్మి మోసపోవద్దు అని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.