Site icon NTV Telugu

CM Jagan: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ప్రర్యటన

Cm Ys Jagan

Cm Ys Jagan

నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. తొలుత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వెళ్లనున్న జగన్.. అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం వెళ్లనున్నారు.. అక్కడ తుఫాన్ బాధితులతో సీఎం నేరుగా మాట్లాడనున్నారు. అనంతరం కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని బాధిత రైతులను పరామర్శించనున్నారు. అక్కడి నుంచి బుద్దాంలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి రైతులతో సమావేశం కానున్నారు సీఎం జగన్.

Read Also: Congress : తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్‌పై కాంగ్రెస్ ‘గ్యారెంటీలు’ ఎంత భారంగా మారనున్నాయి?

ఇక, ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉదయం 8.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి చేరుకుని అక్కడి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 10 గంటలకు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో కోట మండలం విద్యానగర్‌కు వెళ్లనున్నారు. అక్కడి నుంచి 10.30 గంటలకు రహదారి మార్గంలో వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలో దెబ్బతిన్న స్వర్ణముఖి రివర్‌ బ్యాంక్‌ను సీఎం జగన్ పరిశీలిస్తారు.

Read Also: Astrology: డిసెంబర్ 08, శుక్రవారం దినఫలాలు

అలాగే, ఉదయం 11.05 గంటలకు బాలిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేసిన తుఫాన్ ప్రభావంతో ఫొటో ప్రదర్శనను సీఎం జగన్ పరిశీలిస్తారు. అనంతరం తుఫాన్ బాధిత ప్రజలతో నేరుగా ఆయన మాట్లాడతారు. ఇక, 11.40 గంటలకు తిరిగి విద్యానగర్‌ దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుని.. మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి, నేరుగా బాపట్ల జిల్లాకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హెలికాప్టర్లో బాపట్ల చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఆ జిల్లాలో కర్లపాలెం మండలం, పాతనందాయపాలెం వద్ద నీటిలో ఉన్న మిర్చి పంట, బుద్దాం దగ్గర తుంగభద్ర కాల్వ పక్కనే నీట మునిగిన వరి పంటను పరిశీలిస్తారని అధికారులు వెల్లడించారు.

Exit mobile version