NTV Telugu Site icon

CM YS Jagan Tour: బనగానపల్లెలో మార్చి 4న సీఎం జగన్ పర్యటన

Cm Ys Jagan

Cm Ys Jagan

CM YS Jagan Tour: నంద్యాల జిల్లాలోని బనగానపల్లెలో ఈనెల 4న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి పర్యటన ఖరారైంది. రూ.22 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రిని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ గ్రౌండ్, సభా ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరిశీలించారు. సీఎం పర్యటనకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది.

Read Also: Minister Kottu Satyanarayana: బాబు పాలనలో చేసిన పనుల వల్లే రాష్ట్రంలో దుర్భిక్షం ఏర్పడింది..