Site icon NTV Telugu

CM Jagan: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష

Cm Jagan

Cm Jagan

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమావేశం చేపట్టిన ముఖ్యమంత్రి.. పలువురు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత, సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వర్ష ప్రభావం, తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రాధానంగా చర్చ జరిగింది. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయాలని ఇప్పటికే ప్రభావిత నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు.

Read Also: KA Paul : ప్రజలు చూపంతా మా పార్టీ వైపు ఉంది

గోదావరిలో వరద పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. గోదావరి నదీ తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ ముంపు బాధితులకు బాసటగా నిలవాలని చెప్పారు. ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల పరిస్థితులతో పాటు, భారీ వర్షాలు కురుస్తున్న ఇతర ప్రాంతాల గురించి కూడా జగన్ ఆరా తీశారు. 42 మండలాల్లోని 458 గ్రామాలను అప్రమత్తం చేశామని ఈ సందర్భంగా సీఎం జగన్ కు అధికారులు తెలిపారు.

Read Also: Champaran Mutton Recipe: చంపారన్ మటన్‌ను ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోండిలా..!

అయితే, ఇప్పటికే పలు జిల్లాల్లో ఇప్పటికే కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేసినట్లు, అలాగే ముంపునకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో బోట్లు సహా సహాయక సిబ్బందిని సిద్ధం చేశామని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల విషయంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని, వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల కోసం ముందస్తుగా నిధులను అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ తెలిపారు.

Exit mobile version