NTV Telugu Site icon

CM Jagan: సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే..

Jagan

Jagan

ఏపీలో పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంటోంది. ఓ వైపు కూటమి, మరో వైపు వైసీపీ అగ్రనేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో జోరు పెంచారు. మే 7వ తేదీన(రేపు) మూడు నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం చేయనున్నారు.

Heavy rain: బెంగళూరులో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు

మంగళవారం ఉదయం 10 గంటలకు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ జంక్షన్ లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం.. మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని ఇచ్చాపురం పట్టణం మున్సిపల్ ఆఫీస్ సెంటర్ లో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోని గాజువాక నియోజకవర్గంలో పాత గాజువాక సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. జగన్ పర్యటన సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు సభ ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ జన సమీకరణ చేయనున్నారు.

Ram Mandir: రామమందిర తీర్పు రద్దు చేయాలని రాహుల్ గాంధీ ప్లాన్.. మాజీ కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు..

Show comments