రేపటి నుంచి సీఎం జగన్ వరద ప్రభావిత, ముంపు మండలాల్లో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు సీఎం పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. రేపు ఉదయం 9:30 నిమిషాలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరనున్నారు. 10:30 గం.కు అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట గ్రామానికి ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. 11 గంటలకు కోనవరం బస్టాండ్ సమీపంలో వేదిక దగ్గర వరద బాధిత కుటుంబాలను పరామర్శించునున్నారు. అక్కడ కూనవరం, వీఆర్ పురం మండలాల బాధితులతో ఇంటరాక్షన్ అవ్వనున్నారు ముఖ్యమంత్రి జగన్.
Raj Bhavan: ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వానికి గవర్నర్ సూచనలు.. ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన రాజ్ భవన్
మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కుక్కునూరు మండలం గుమ్ముగూడెం గ్రామానికి సీఎం చేరుకోనున్నారు. అరగంట పాటు గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అక్కడే వరద బాధిత కుటుంబాలతో సీఎం ఇంట్రాక్షన్ కానున్నారు. ఆ తర్వాత సాయంత్రం నాలుగున్నర గంటలకు రాజమండ్రి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్. అక్కడ స్థానిక నాయకులతో సమావేశం కానున్నారు. రాత్రికి రాజమండ్రిలో విడిది చేయనున్నారు. ఎల్లుండి ఉదయం 10 గంటలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజపు లంకకు చేరుకోనున్నారు. అక్కడ వరద బాధిత కుటుంబాలను సీఎం పరామర్శించనున్నారు. అనంతరం రామాలయంపేట గ్రామం తానేలంకకు చేరుకుని.. అయినవిల్లి మండలం, తోటరాముడివారిపేటలో బాధితులతో సీఎం ఇంట్రాక్షన్ కానున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తాడేపల్లికి ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణం కానున్నారు.