NTV Telugu Site icon

CM Jagan: నేడు విజయవాడకు సీఎం.. పలు అభివృద్ది పనులను ప్రారంభించనున్న జగన్..!

Jagan

Jagan

Vijayawada: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు (మంగళవారం) విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి కృష్ణలంక కనకదుర్గమ్మ వారధి దగ్గరకు చేరుకోనున్నారు. అక్కడ కొత్తగా నిర్మించిన ఇరిగేషన్‌ రిటైనింగ్‌ వాల్, రివర్‌ ఫ్రంట్‌ పార్కును ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలోని పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధి దారులకు అందజేయనున్నారు. ఆ తర్వాత తాడేపల్లిలోని నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు.

Read Also: SBI : సుప్రీంకోర్టు తీర్పుతో ఆరుగంటల్లో రూ.13,075కోట్లు నష్టపోయిన ఎస్బీఐ ఇన్వెస్టర్లు

అయితే, రిటైనింగ్ వాల్స్ పూర్తి కావడంతో కృష్ణలంక వాసుల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని వైసీపీ ప్రభుత్వం చూపించింది. వారికి ఇచ్చిన మాటను సీఎం జగన్‌ నిలబెట్టుకున్నారు. 2019లో కృష్ణానదికి ఎనిమిది లక్షల క్యూసెక్కుల వరద చేరగా.. అప్పట్లో యనమలకుదురు, కృష్ణలంక, రాణీగారితోట ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. రామలింగేశ్వర్ నగర్ నుంచి యనమలకుదురు వరకూ గత ప్రభుత్వం నిర్మించిన రిటైనింగ్ వాల్ వరదల నుంచి రక్షణ ఇవ్వకపోవడంతో.. యనమలకుదురు ఎగువనున్న ప్రాంతాలకు వరద కష్టాలు మరింత పెరిగాయి. దీంతో వరద నుంచి ప్రజలకు శాశ్వతంగా రక్షణ కల్పించేందుకు సీఎం జగన్ పూనుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన 2.26 కిలోమీటర్ల మేర ఫేజ్ -2, ఫేజ్ -3 రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండవ దశలో 134.43 కోట్లతో 1.2 కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ పూర్తి కూడా అయిపోయింది.

Read Also: Allu Arjun Fans : మితిమీరిన అభిమానం.. యువకుడి పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాడి..

ఇక, కోటి నగర్ నుంచి కనకదుర్గ వారధి వరకూ రిటైనింగ్ వాల్ను ప్రభుత్వం నిర్మించింది. 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా జగన్ సర్కార్ రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేశారు. మూడు అడుగుల వెడల్పుతో 18 మీటర్ల లోతులో ర్యాఫ్ట్ పద్ధతిలో పునాదులు వేసి.. 8.9 మీటర్ల ఎత్తులో కాంక్రీట్ రిటైనింగ్ వాల్ నిర్మించేశారు. మూడవ దశలో 235.46 కోట్లతో 1.06 కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ ను దాదాపు పూర్తి చేశారు. కనకదుర్గ వారధి నుంచి పద్మావతి ఘాట్ వరకూ రిటైనింగ్ వాల్ను నిర్మించారు.