ఈనెల 13న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పట్నం వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ముగింపు వేడుకలు విశాఖలోని ACA స్టేడియంలో జరుగనున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ పోటీలను సీఎం జగన్ వీక్షించనున్నారు. అందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
Read Also: AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా..
ఇదిలా ఉంటే.. రేపటి నుంచి విశాఖ వేదికగా ‘ఆడుదాం ఆంధ్రా’ ఫైనల్స్ జరుగనున్నాయి. ఈ పోటీల్లో 5 కేటగిరీల్లో 3వేల మంది క్రీడాకారులు పాల్గోనున్నారు. రేపు విశాఖ రైల్వే గ్రౌండ్ లో ప్రారంభ వేడుకలను క్రీడల శాఖా మంత్రి ఆర్కే రోజా ప్రారంభించనున్నారు. అందుకోసం కలెక్టర్ మల్లిఖార్జున షెడ్యూల్ ప్రకటించారు. ఇక ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల్లో విజేత జట్టుకు రూ. 5 లక్షలు, రన్నరప్ కు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 2లక్షలు చొప్పున ప్రైజ్ మనీ అందజేస్తారు.
